AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: బీజేపీ, జనసేన పొత్తు పొడిచినట్లే..! ఢిల్లీకి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి.. స్పెషల్ ఫ్లైట్లో..

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు.

Pawan Kalyan: బీజేపీ, జనసేన పొత్తు పొడిచినట్లే..! ఢిల్లీకి పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి.. స్పెషల్ ఫ్లైట్లో..
Pawan Kalyan, Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 25, 2023 | 1:58 PM

Share

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఈ భేటీ కోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. పవన్‌ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు. పొత్తులో భాగంగా ఏపీతో సరిహద్దు ఉన్న నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటిలో జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. బీజేపీతో పొత్తుకు జనసేన సిద్ధమైందని.. అయితే సీట్ల విషయంపై చర్చించనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని లక్ష్మణ్‌ అన్నారు. ఈ విషయంలో రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపారు. ఎన్ని సీట్లు అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని లక్ష్మణ్‌ ప్రకటించారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించిన కిషన్ రెడ్డి..

కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా.. బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదని.. కాంగ్రెస్ అన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి ఆలోచన వాళ్లది.. ఎవరి అభిప్రాయం వాళ్లది.. ఆయన అన్నంత మాత్రాన జరగదు.. ఏదైనా ప్రజలు తేల్చాలి అంటూ కిషన్ రెడ్డి తెలిపారు.

సముచిత గౌరవం ఇచ్చాం..

బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చామని ఆ పార్టీ OBC మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. మునుగోడులో ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెమటోడ్చారని గుర్తు చేశారు. పార్టీని వీడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో రాజకీయాలను BRS కలుషితం చేస్తోందని లక్ష్మణ్‌ ఆరోపించారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తోందన్నారు. నమ్మి ఓట్లేస్తే కర్నాటకలో ప్రజలను కాంగ్రెస్‌ నట్టేట ముంచేసిందంటూ తెలిపారు.

ఆత్మ ఎప్పుడూ కాంగ్రెస్‌లోనే ఉంది..

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ నేత బూరనర్సయ్య గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్నా రాజగోపాల్‌రెడ్డి ఆత్మ ఎప్పుడూ కాంగ్రెస్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడంలో ఆశ్చర్యమేమీ లేదని బూరనర్సయ్య గౌడ్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..