Pawan Kalayan: నేడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన.. కార్యకర్తల కుటుంబాలకు ఆర్ధిక సాయం

|

May 20, 2022 | 6:53 AM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రమాదవ శాత్తు మరణించిన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ఆ కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేయనున్నారు.

Pawan Kalayan: నేడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన.. కార్యకర్తల కుటుంబాలకు ఆర్ధిక సాయం
Pawan Kalyan
Follow us on

Pawan Kalayan: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో నేడు పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించి ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన చౌటుప్పల్, హుజూర్ నగర్ కు చెందిన జనసైనికులు కొంగరి సైదులు, కడియం శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించి.. రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేయనున్నారు.

ఉదయం 10గం.కు పవన్ కల్యాణ్  హైదరాబాద్ నుంచి బయలుదేరతారు. మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్తారు. అక్కడ  కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు.  అనంతరం కోదాడకు వెళ్లనున్నారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి రూ. 5 లక్షల చెక్ అందజేస్తారు. జనసేన పార్టీ తెలంగాణ విభాగం ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read: Horoscope Today: ఈరోజు ఈరాశివారు అధికశ్రమ చేయాల్సి ఉంటుంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

CM KCR Delhi Tour: ఈరోజు మధ్యాహ్నం హస్తినకు పయనంకానున్న సీఎం కేసీఆర్.. రైతు ఉద్యమంలో అసువులుబాసిన కుటుంబాలకు పరామర్శ

Mahesh Babu: మనసులోని మాటలను బయటపెట్టిన మహేష్ బాబు.. ఆ సినిమాను రీక్రియేట్ చేయాలనుందంటూ..