SCR: ఆ నగరాల మధ్య వేసవి ప్రత్యేక రైలు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
వేసవి సెలవులు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు అధికంగా ఉండటంతో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. సొంతూరికి వెళ్లే వారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సరిపడా రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర...
వేసవి సెలవులు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు అధికంగా ఉండటంతో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. సొంతూరికి వెళ్లే వారితో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. సరిపడా రైళ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి అవస్థను గమనించిన రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడుపుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 07581/07582 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30కి సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15కి కటక్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు కటక్‌లో 22వ తేదీ సాయంత్రం 6.55కి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 5.20కి సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, జ, శ్రీకాకుళంరోడ్డు మీదుగా భువనేశ్వర్ చేరుకుంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
RCB vs GT IPL Match Result: గుజరాత్ ను చిత్తు చేసిన ఆర్సీబీ.. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం