Telangana: దొరికిందే సందు.. కల్లును కుమ్మేస్తున్న రామచిలుకలు..

| Edited By: Ram Naramaneni

Dec 29, 2024 | 3:29 PM

పచ్చని రామచిలకలు.. ఈత చెట్లపై, తాటి చెట్లపై వాలుతూ కల్లును ఎంజాయ్ చేస్తున్నాయి. ఉదయాన్నే వాటికి ఇదే ఫణి. రామచిలుకలు కల్లు తాగుతూ స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎంచక్కా కల్లుముంతపై వాలి వాటి ముక్కుతో పొడిచి కల్లుతో దాహాన్ని తీర్చుకుంటున్నాయి. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు స్థానికులు..

Telangana: దొరికిందే సందు.. కల్లును కుమ్మేస్తున్న రామచిలుకలు..
Toddy
Follow us on

మనుషులే కాదు, పక్షులు కూడా ఈత కల్లు సేవిస్తున్నాయి. చెట్టు నుంచి వచ్చే తియ్యటి కల్లును లాగించేస్తున్నాయి. ఉదయం పూట సాయంత్రం పూట చెట్ల చుట్టూ తిరుగుతూ కడుపు నిండా కల్లు తాగి ఎంజాయ్ చేస్తున్నాయి ఈ రామచిలుకలు.. ఈ చిలుకల సందడిని చూడటానికి స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని యాదవ నగర్ సమీపంలో ఈత చెట్లు, తాటి చెట్లుపై రామ చిలుక కల్లును సేవిస్తున్నాయి. . ఓ చిలుక ఈత కల్లు తాగుతుంటే మరో చిలక సెక్యూరిటీగా ఉండి పక్కనే కాపలా కాస్తుంది.  అయితే ఈత కల్లును తాగేందుకు రామచిలుకలతో పాటు ఉడత, తేనెటీగలు పోటీగా వస్తున్నాయి. వాటిని దూరంగా తరిమి కొడుతున్నాయి చిలుకలు. ప్రతి రోజు ఉదయం.. చెట్ల వద్దకు చిలుకలు గుంపు, గుంపుగా వస్తున్నాయి. కల్లు రుచిగా ఉండటంతో కడుపు నిండ తాగేస్తున్నాయి. ముఖ్యంగా.. ఈత చెట్లపై వాలుతున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు పలువురు.. సెల్ ఫోన్‌లో బందిస్తున్నారు. సహజంగానే.. కల్లు తీయగా ఉండటంతో.. తెగ తాగేస్తున్నాయి చిలుకలు. ఈ సీజన్‌లో కల్లు ఎక్కువగా పారడంతో రామ చిలుకలు చెట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. గెల నుంచి వస్తున్న కల్లును ఫ్రెష్‌గా లాగించేస్తున్నాయి.. ఇప్పుడు రామ చిలుకల సంఖ్య పెరిగిందని గీత కార్మికులు అంటున్నారు.. వచ్చే కల్లులో సగం అవి తాగడంతో కుండ కూడా నిండటం లేదని తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి