Telangana: సిరిసిల్లలో మాజీ డీఎస్పీ ప్రణీత్ అరెస్ట్.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. అసలు కారణం ఇదే..
ఫోన్ ట్యాపింగ్‌తో పాటు సాక్ష్యాల తారుమారు కేసులో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు ప్రణిత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయన అద్దెకు ఉంటున్న సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై రెండు రోజులుగా రెక్కి నిర్వహించారు. ప్రణీత్ రావు అరెస్ట్ విషయంలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన పోలీసు బృందాలు రెక్కి నిర్వహించాయి. ఆదివారం ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌తో పాటు సాక్ష్యాల తారుమారు కేసులో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చెందిన పోలీసు అధికారులు ప్రణిత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయన అద్దెకు ఉంటున్న సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై రెండు రోజులుగా రెక్కి నిర్వహించారు. ప్రణీత్ రావు అరెస్ట్ విషయంలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వచ్చిన పోలీసు బృందాలు రెక్కి నిర్వహించాయి. ఆదివారం ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ప్రణిత్ రావుపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు కుట్ర కేసు నమోదు చేశారు. సోమవారం నుండి ప్రణీత్ రావును అరెస్ట్ చేసేందుకు పోలీసు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. హైదరాబాద్ నుండి సిరిసిల్లోని శ్రీనగర్ కాలనీలో ప్రణిత్ రావు అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు. సోమవారం నుండి మంగళవారం అర్థరాత్రి వరకు కూడా ఆయన ఇంటి ముందే పోలీసులు వెయిట్ చేశారు. కానీ ఇంట్లోకి వెల్లి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదు. చివరకు మంగళవారం అర్థరాత్రి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.
లేడన్న ప్రచారం..
ఫోన్ ట్యాపింగ్ ఘటన వెలుగులోకి రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్టికల్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. అప్పటి వరకు ఎస్ఐబీ ఎస్ఓటీ ఇంఛార్జిగా ఉన్న ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడగానే సిరిసిల్లలో రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో ఎస్ఐబీలో హర్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారన్న విషయం వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం దాటి వెల్లవద్దని ఆదేశించారు. అయితే సిరిసిల్లకు బదిలీ అయిన తరువాత విధుల్లో చేరిన ప్రణీత్ రావు స్థానిక పోలీసు అధికారులకు టచ్‌లో లేకుండా పోయారని జిల్లా అధికారవర్గాలు చెప్పాయి. సోమవారం ఆయన్ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాయి. అయితే ఆయన ఉన్నాడన్న ఉనికి కానీ ఆనవాళ్లు కానీ ఏ మాత్రం కనిపించకపోవడం, ఉన్నట్టుండి అద్దె ఇంటికి ఆయన నేమ్ బోర్డు ఉన్నట్టుగా వెలుగులోకి రావడం సరికొత్త చర్చకు దారి తీసింది. మరోవైపున సస్పెన్షన్‌కు గురైన ప్రణీత్ రావు జిల్లా పోలీసు యంత్రాంగంతో టచ్‌లో లేకుండా ఉండడం కూడా విచిత్రంగా మారింది. సాధారణంగా పోలీసు విభాగంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సదరు పోలీసులు సంబంధిత జిల్లాలోని అధికారులకు టచ్‌లో ఉంటుంటారు. కానీ ప్రణీత్ రావు జిల్లా పోలీసు అధికారులకు ఏ మాత్రం తెలియకుండా శ్రీనగర్ కాలనీలోనే నివాసం ఉన్నట్టు వెలుగులోకి రావడం ఆశ్యర్యపరిచింది. చివరకు మంగళవారం అర్థరాత్రి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడంతో ఆయన అదృశ్యంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్టయింది.
షికార్లు చేసిన పుకార్లు..
సస్పెండెడ్ డీఎస్పీ ప్రణిత్ రావు అరెస్ట్ వ్యవహారంలో జరిగిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఆయన్ను హైదరాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారని రెండు రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నాడని ప్రచారం జరిగింది. మరో వైపు సోమవారం రాత్రి కరీంనగర్‌లోని ఓ అపార్ట్ మెంట్లో ఉండగా ఆయనను పట్టుకున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కానీ మంగళవారం అర్థరాత్రి సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో ప్రణిత్ రావు అద్దెకు ఉంటున్న ఇంటి నుండే పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటి వరకు జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.