Amit Shah: అది అబద్ధమని చెప్పగలరా.? సీఎం రేవంత్‌కు అమిత్‌షా సవాల్‌..

Amit Shah: అది అబద్ధమని చెప్పగలరా.? సీఎం రేవంత్‌కు అమిత్‌షా సవాల్‌..

Narender Vaitla

|

Updated on: Mar 12, 2024 | 7:13 PM

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్‌ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో రూ. 12 లక్షల కోట్ల అవనీతికి పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాము చెప్పేది అవాస్తవమని చెప్పాలని సవాలు విసిరారు....

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్‌ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో రూ. 12 లక్షల కోట్ల అవనీతికి పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తాము చెప్పేది అవాస్తవమని చెప్పాలని సవాలు విసిరారు. సీఎం రేవంత్‌ రెడ్డి మజ్లిస్‌ పార్టీకి ఆప్తమిత్రుడన్న అమిత్‌ షా.. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌ను చేశారన్నారు.

సీఏఏను అమలు చేసి పాక్‌, బంగ్లాదేశ్‌ శరణార్థులకు న్యాయం చేశామన్న అమిత్‌షా.. సీఏఏను కాంగ్రెస్‌,మజ్లిస్‌ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. సీఏఏఈ అమలుతో ముస్లింల పౌరసత్వం రద్దవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..