Vanama Raghava: కాలకేయుడు రాఘవను ఎన్‌కౌంటర్ చేయండి.. డిమాండ్ చేస్తున్న స్థానికులు

|

Jan 08, 2022 | 3:28 PM

Palwancha family incident: కాలకేయుడు వనమా రాఘవ అరెస్ట్‌ అయ్యాడు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు..

Vanama Raghava: కాలకేయుడు రాఘవను ఎన్‌కౌంటర్ చేయండి.. డిమాండ్ చేస్తున్న స్థానికులు
Vanama Raghava
Follow us on

కాలకేయుడు వనమా రాఘవ అరెస్ట్‌ అయ్యాడు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు రాఘవ నలుగురి ప్రాణాలు బలితీసుకున్నాడు. ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి అరాచకానికి తెరతీసిన రాఘవ..నీ ఆస్తి నీకు దక్కాలంటే భార్యను పంపాలని రామకృష్ణను మానసికంగా వేధించాడు. ఓ వైపు వివాదం పీక్స్‌కు చేరి, మరో వైపు రాజకీయ మంటలు చెలరేగడంతో పోలీసులు సైతం ఊపిరిబిగపట్టలేకపోయారు. చివరకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో రాఘవను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తు ప్రచారం సాగింది. కాని రాఘవ మాత్రం పోలీసుల కళ్లుగప్పి తిరిగేందుకు యత్నించాడు. అనూహ్యంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట, చింతలపూడి మధ్య రెండు రాష్ట్రాల సరిహద్దులో అరెస్ట్ చేశారు. కొత్తగూడెం పోలీసులు మాటు వేసి అతడిని పట్టుకున్నారు. పాల్వంచ నుంచి అడవి మార్గం ద్వారా దమ్మపేట, అటు నుంచి ఏపీకి వెళ్లే క్రమంలో అతడిని అరెస్ట్‌ చేశారు. రాఘవతో పాటు కొంత మంది ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచరుడు గిరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో వనమా రాఘవేంద్ర ఏ2 గా ఉన్నాడు. ఈనెల 3న కుటుంబం (ఇద్దరు కుమార్తెలు, భార్య)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రామకృష్ణ. అంతకన్నా ముందు ఆయన సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియోలో వనమా రాఘవ వేధింపుల గురించి బయటపెట్టి చనిపోయాడు. డబ్బులు అడిగితే ఇచ్చేవాడిని.. తన భార్యను అడిగాడంటూ రాఘవలోని కీచకుడిని బయటకు తీశారు. దీంతో వనమా రాఘవపై ఐపీసీ 302,306,307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అయిన రాఘవ అరాచకాలపై స్థానికులు మండిపడుతున్నారు. నలుగురి ఆత్మహత్యకు కారణమైన రాఘవను ఎన్‌కౌంటర్ చేయాలని, లేదా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజవర్గంలో ఇంకా చాలా మంది వనమా రాఘవ బాధితులు ఉన్నారని అంటున్నారు.  అలాంటి మానవత్వం లేని వ్యక్తులను ఉపేక్షించొద్దని సూచిస్తున్నారు.

అటు వనమా రాఘవను పాల్వంచ పోలీస్ స్టేషన్ నుండి కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాఘవను ఉరితీయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

 

Also Read..

Acharya: మరోసారి మెగా అభిమానులకు నిరాశ తప్పదా ?.. ఆచార్య రిలీజ్ పై నెట్టింట్లో సందేహాలు..

Cool Drinks: ‌కూల్‌డ్రింక్స్‌ అతిగా తాగుతున్నారా..! పరిశోధనలో షాకింగ్‌ నిజాలు వెల్లడి..?