Padma Award winners: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు.. సీఎం రేవంత్‌ అభినందనలు!

|

Jan 26, 2024 | 8:07 AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు..

Padma Award winners: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ అవార్డులు.. సీఎం రేవంత్‌ అభినందనలు!
Padma Award Winners
Follow us on

హైదరాబాద్‌, జనవరి26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు కళాకారులు పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలను అందించిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళల విభాగంలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగాం కు చెందిన గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్తపతి వేణు ఆనందా చారి లకు పద్మశ్రీ పురస్కారం వరించింది. విద్య సాహిత్య రంగాల్లో బంజారా గాయకుడు కేతావత్ సోంలాల్, పద్య కవి కూరేళ్ల విఠలాచర్యలకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

63 ఏళ్ల వయస్సున్న కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. తెలుగు, కన్నడ తత్వాలు పాడుతూ బుర్ర వీణను వాయించటంలో సంగీత నిపుణునిగా స్థానికంగా అందరి గుర్తింపును అందుకున్నారు. ఇక గడ్డం సమ్మయ్య యక్షగాన కళాకారుడు. 67 ఏళ్ల వయస్సున్న సమ్మయ్య అయిదు దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. దాదాపు 19 వేల ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్ష కళాకారుల సంఘంతో పాటు గడ్డం సమయ్య యువ కళా క్షేత్రం ద్వారా ఈ కళను ఇతరులకు నేర్పించాడు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతీ కళలను దేశమంతటికి చాటిచెప్పారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తెలంగాణ పురాతన కళలకు అరుదైన గౌరవం దక్కిందని ఆయన అన్నారు. అవార్డు గ్రహితలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ నుంచి పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన ఐదుగురిని ముఖ్యమంత్రి అభినందించారు.

మాజీ సీఎం కేసీఆర్‌ హర్షం

తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేసారు. ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో ‘భాగోతం’ పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయిన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజన కారులు.. బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద్ చారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్యలను కూడా కేసీఆర్ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.