గంజాయి మాటెత్తితే తాట తీసేలా వ్యవహారిస్తున్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి జాడ తెలిస్తేచాలు.. క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న క్లూ దొరికిందా.. ఇక.. అంతే సంగతులు.. వల పన్ని మరి నిందితుల గంజాయి గుట్టురట్టు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్ నగరంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని మూలాలు దూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో పోలీసులు ఆ దిశగా వేట మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే.. దూల్‌పేట్‌లో గంజాయి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసలు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న దూల్‌పేట్‌ను స్పెషల్ ఆపరేషన్‌తో గుడుంబా ప్రీ దూల్‌పేట్‌గా మార్చారు. దూల్‌పేట్‌లో గుడుంబా కనుమరుగైపోయి.. గంజాయికి అడ్డాగా మారడంతో దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆపరేషన్ దూల్‌పేట్ పేరుతో గంజాయిని అంత చూస్తున్నారు. జాడ కనిపిస్తే చాలు తాట తీస్తున్నారు.
ఆపరేషన్ దూల్‌పేట్‌తో గంజాయి డెన్‌లలో దబిడి.. దిబిడి మొదలైంది. డ్రగ్ ఫ్రీ దూల్‌పేట్‌కు ఆగష్టు 31 డెడ్ లైన్ పెట్టుకుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. వరుస దాడులు నిర్వహించి గంజాయి స్థావారాలను నేల మట్టం చేశారు. నెల రోజుల్లో వంద మందికి పైగా గంజాయి సప్లైర్స్ తోపాటు 110కిలోల గంజాయిని సీజ్ చేసి పలువురిని బైండోవర్ చేశారు. గంజాయి విక్రయమే జీవన ఉపాధి గా పెట్టుకున్న వారిని అరెస్ట్ చేసి కటాకటాలలోకి నెట్టారు. తిరిగి మళ్ళీ ఈ దందాలో దిగకుండా పగడ్బంది ప్రణాళిక తో ముందుకు వెళ్తున్నారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
ఒకప్పుడు మత్తు మాఫియాది.. ఆడిందే అట పాడిందే పాట..! అదంతా ఇప్పుడు ఒడిసిన ముచ్చట. ఇప్పుడు లెక్క మారింది. మార్పు మార్కు మత్తు మాఫియా బెండు తీస్తోంది. గుడుంబాను పూర్తిగా నిర్మూలించిన అధికారులు ఇప్పుడు గంజాయి డెన్‌ల భారతం పడుతున్నారు. ఇదే క్రమంలో ఆపరేషన్ దూల్‌పేట్‌తో అష్టదిగ్బంధనం చేసి గంజాయి డెన్‌లను గుట్టురట్టు చేస్తున్నారు. సరకు ఎక్కడి నుండి వస్తుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు. డేటా అంత ఎక్సైజ్ డైరీకి ఎక్కింది. భారీగా గంజాయి సీజ్ చేయడం సహా 100మందిని అరెస్ట్ చేశారు. మరికొందరినీ బైండోవర్ చేశారు. ఫ్యూచర్ లో కూడా గంజాయి మారక ఉండకుండా పక్కడబంది యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎక్సైజ్ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..