Telangana Congress: ఈ సీనియర్లకు ఏమైంది..! ప్రచారంలో అతనొక్కడే.. కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి..

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పక్కా వ్యూహాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే, తెలంగాణ దంగల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఢిల్లీ నుంచి అడపాదడపా వచ్చే రాహుల్‌, ప్రియాంక గాంధీలు తప్పితే రాష్ట్రమంతటా ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్లు కనిపించడంలేదని టాక్ వినిపిస్తోంది.

Telangana Congress: ఈ సీనియర్లకు ఏమైంది..! ప్రచారంలో అతనొక్కడే.. కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 15, 2023 | 5:47 PM

Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పక్కా వ్యూహాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అయితే, తెలంగాణ దంగల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఢిల్లీ నుంచి అడపాదడపా వచ్చే రాహుల్‌, ప్రియాంక గాంధీలు తప్పితే రాష్ట్రమంతటా ప్రచారం చేయడానికి కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్లు కనిపించడంలేదని టాక్ వినిపిస్తోంది. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి లాంటి సీనియర్‌ నేతలు.. తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు తప్పితే పక్క నియోజకవర్గాల్లోకి కనీసం తొంగి కూడా చూడడం లేదు. తమ నియోజకవర్గాలు దాటి మిగిలిన నియోజకవర్గాల్లో పాదం పెట్టిన పాపాన పోవడం లేదు. కనీసం తమ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లడం లేదు. కేవలం రేవంత్‌ ఒక్కరే కాలికి బలపం కట్టుకుని తెలంగాణ అంతటా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు.

ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి లాంటి సీనియర్‌ నేతలంతా సీఎం సీటు మీద కర్చీఫ్‌ వేసిన వాళ్లే. ఏదో ఒక సందర్భంలో తమ మనసులో మాట చెప్పినవాళ్లే. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేని జానారెడ్డి కూడా సీఎం సీటు మీద మనసు పారేసుకున్నారు. ఆ సీటు తన దగ్గరకే వస్తుందంటూ ఓ సందర్భంలో అన్నారు. నాగార్జున సాగర్‌లో పోటీ చేస్తున్న తన కుమారుడు జైవీర్‌ రెడ్డి కోసం మాత్రమే జానారెడ్డి ప్రచారం చేస్తున్నారు తప్పితే.. మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్‌ చేయడం లేదు. ఇక ఉత్తమ్‌, కోమటిరెడ్డి, భట్టి, జగ్గారెడ్డి లాంటి నేతలు కూడా తమ నియోజకవర్గాలను తప్పించి వేరే చోట్ల పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లడం లేదు.

సీఎం సీటు కోసం పోటీలో ఉన్న సీనియర్లు.. కనీసం కొన్ని చోట్ల అయినా ప్రచారానికి రాకపోవడం కాంగ్రెస్‌ కేడర్‌ను కూడా ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే తమకు కీలక పదవులు వస్తాయని సీనియర్లు భావిస్తున్నారట. అందుకే తమ నియోజకవర్గాల్లో ఓటమి పాలవకుండా చూసుకోవడానికే వాళ్లు తమ తమ స్థానాలను దాటి రావడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీలో సీనియర్‌ నేతలుగా చలామాణీ అవుతున్న శ్రీధర్‌ బాబు, మధు యాష్కీ, షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ లాంటి వాళ్లు కూడా తమ తమ స్థానాలకే పరిమితమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!