Onions Price: కంటనీరు పెట్టిస్తోన్న ఉల్లి ధరలు.. వచ్చే నెల రోజులు గడ్డు కాలమే! కిలో ధర ఎంతంటే

|

Oct 31, 2023 | 11:32 AM

నెల రోజుల క్రితం క్వింటాల్‌ రూ.3000 నుంచి 3500 ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు పలు రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాల వరకూ దిగుమతి అవుతుంటుంది. కానీ ప్రస్తుతం రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత వారం, కేంద్రం ఉల్లిపాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. పైగా కనీస ఎగుమతి ధరను కూడా విధించింది. బఫర్ స్టాక్‌ల కోసం..

Onions Price: కంటనీరు పెట్టిస్తోన్న ఉల్లి ధరలు.. వచ్చే నెల రోజులు గడ్డు కాలమే! కిలో ధర ఎంతంటే
Onions Price
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: గతవారం రోజులుగా ఉల్లి ధర బెంబేలెత్తిస్తోంది. ముంబాయితోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ధరలు నానాటికీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అదుపులేకుండ పెరిగిపోతున్న ఉల్లిధరలు సామాన్యులకు కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.80 చేరుకుంది.

నెల రోజుల క్రితం క్వింటాల్‌ రూ.3000 నుంచి 3500 ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు పలు రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాల వరకూ దిగుమతి అవుతుంటుంది. కానీ ప్రస్తుతం రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత వారం, కేంద్రం ఉల్లిపాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. పైగా కనీస ఎగుమతి ధరను కూడా విధించింది. బఫర్ స్టాక్‌ల కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయల సేకరణ చేపట్టింది. ఈ కారణంగా ఉల్లి ధరలపై ప్రభావం పడిందని వ్యాపారులు అంటున్నారు.

మరోవైపు మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతులు పంట వేయలేదని, అందుకే దిగుమతి తగ్గి, ధరలు ఆకాశానికి తాకుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆశించిన రీతిలో ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ఏపీ రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. దీంతో ఆంధ్రా నుంచి ఉల్లి దిగుమతి తక్కువైంది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.80 ఉండగా అది రూ.150 వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్తపంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్‌కు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ధర ఉంటుందని, నెల రోజులపాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందని అధికారులు అంటున్నారు. దీంతో గతంలో 1-2 కిలోలు ఉల్లి కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు 250 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 80 వరకు ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.