Telangana: ధర్మపురిలో హైటెన్షన్.. ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవనున్న అధికారులు..

|

Apr 23, 2023 | 7:51 AM

2018లో జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన నూకపల్లి బీఆర్‌కే కాలేజీలోని స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టేందుకు హైకోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు ఇటీవల అనుమతినిచ్చింది.

Telangana: ధర్మపురిలో హైటెన్షన్.. ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవనున్న అధికారులు..
Strong Room
Follow us on

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో 2108 అసెంబ్లీ ఎన్నిక సమయంలో ఓట్ల లెక్కింపు అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఈవీఎంను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. అయితే అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన నూకపల్లి బీఆర్‌కే కాలేజీలోని స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టేందుకు హైకోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు ఇటీవల అనుమతినిచ్చింది. అదే సమయంలో కార్పెంటర్, తాళాలు తీసే నిపుణుల సాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అన్ని పార్టీల లీడర్ల సమక్షంలో ఈ పని చేయాలని హైకోర్టు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాళాలు తీసిన తర్వాత స్ట్రాంగ్‌ రూంలోని ఫైళ్లు, ఈవీఎంలు తరలించేందుకు రిటర్నింగ్‌ అధికారి అడిగిన వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతను కల్పించాలని సూచించారు. అయితే ఈరోజున అధికారులు స్ట్రాంగ్ రూం తాళాలు తెరవనున్నారు.

ఈసీ తరఫు లాయర్‌ దేశాయ్‌ అవినాశ్‌ వాదిస్తూ, ఘటనపై ముగ్గురు ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని, ఈ నెల 26న రిపోర్టు వచ్చాక హైకోర్టుకు సమర్పిస్తామని గతంలో తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచి ఎన్నికకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కలెక్టర్ మధ్యంతర పిటిషన్ ​దాఖలు చేసినప్పటికీ, కలెక్టర్‌ కావాలనే తాళాలను తప్పుగా వినియోగించారని, దీంతో అవి సరిపోలేదని పిటిషనర్‌ అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ లాయర్‌ ధర్మేశ్‌ డీకె జైశ్వాల్‌‌తో వాదించారు. అలాగే కోర్టు తాళాలు తెరవమన్న రోజే తాళాలు చేసే వ్యక్తి, వడ్రంగిని కూడా తీసుకురావడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కలెక్టర్‌ పిటిషన్‌ను అనుమతించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..