శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అదేవిధంగా నారాయణ్ ఖేడ్ కస్తూర్బాగాంధీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో..24 గంటల్లో మొత్తం 336 మంది విద్యార్థులు ట్రీట్‌మెంట్ పొందినట్లు డిస్పెన్సరీ రికార్డులు చెబుతున్నాయి. తాగునీరు కలుషితమవడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విషయం బయటకు పొక్కకుండా..విద్యార్థులకు క్యాంపస్ డిస్పెన్సరీలోనే చికిత్స అందించింది IIIT యాజమాన్యం. ఐతే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..డిస్పెన్సరీ డాక్టర్ ఉదయం పదిన్నర వరకు విధులకు హాజరుకాకపోవట౦…అప్పటివరకు ఇద్దరు నర్సులే అరకొర వైద్యం అ౦దించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై TV9 కథనాలతో స్పందించిన అధికారులు..వైద్యుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. బయట నుంచి వైద్య బృందాన్ని రప్పించి చికిత్స అందిస్తున్నారు. పలువురు విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఇక ఎచ్చెర్ల IIIT ని స౦దర్శి౦చిన జిల్లా కలెక్టర్..విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆహారంతో పాటు తాగు నీటిని పరీక్షి౦చాల౦టూ అధికారులను ఆదేశించారు.
ఇక ఇటు సంగారెడ్డి నారాయణఖేడ్ కస్తూర్బాగాంధీ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనలో చర్యలు తీసుకున్నారు అధికారులు. స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు..ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఏం తిన్నారు..వాళ్లు తిన్న ఫుడ్.. పాయిజన్ అయిందా లేక వాటర్ పొల్యూట్ అయిందా అసలేం జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..