Obscene dances: తెలంగాణలోనూ మొదలైన ‘అశ్లీల’ సంస్కృతి.. కట్టమైసమ్మ జాతరలో వికృత కార్యక్రమాలు..

|

Mar 01, 2021 | 2:16 PM

Obscene dances: అశ్లీల నృత్యాల తాలూకు వార్తలు ఇప్పటి వరకు ఆంధ్రాలోనే ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడా సంస్కృతి తెలంగాణలోనూ పాకింది.

Obscene dances: తెలంగాణలోనూ మొదలైన ‘అశ్లీల’ సంస్కృతి.. కట్టమైసమ్మ జాతరలో వికృత కార్యక్రమాలు..
Follow us on

Obscene dances: అశ్లీల నృత్యాల తాలూకు వార్తలు ఇప్పటి వరకు ఆంధ్రాలోనే ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడా సంస్కృతి తెలంగాణలోనూ పాకింది. భక్తి పారవశ్యంతో సాగాల్సిన దైవ కార్యం.. అసాంఘీక కార్యకలాపాలకు నెలవైంది. వివరాల్లోకెళితే.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్టమైసమ్మ జాతరలో భక్తి, ఆధ్యాత్మికతను పక్కన పెట్టి మద్యం, గుండుపట్టాలు, పేకాట, మహిళలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు పలువురు నిర్వాహకులు. ఈ చర్య స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తుతోంది.

అమ్మవారిని దర్శించుకుని కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపాల్సిన వాతావరణంలో అశ్లీల నృత్యాలు జాతరకు వచ్చిన మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. మరోవైపు మద్యం ఏరులై పారుతోంది. స్థానిక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న జాతర నిర్వాహకులు గుండు పట్టాలను ఏర్పాటు చేసి వారి జేబులు ఖాళీ చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ఖాకీలు సైతం ప్రేక్షక పాత్ర వహించడం, ప్రజాప్రతినిధులు దగ్గరుండి కార్యక్రమాలు నిర్వహించడం పై పలు విమర్శలకు దారితీస్తోంది. దీనిపై సంబంధిత అధికారులు, పోలీస్ శాఖ స్పందించకుంటే రాబోయే రోజుల్లో నిర్వాహకులు మరింత బరితెగించే అవకాశం లేకపోలేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే జాతరలో విచ్చలవిడితనం ఎక్కువై దోపిడీలు కూడా జరిగే అవకాశం ఉందని భక్తులు బాహాటంగా విమర్శిస్తున్నారు. దీనిపై కలెక్టర్ విచారణ చేసి బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ కార్యక్రమాల వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే నియోజకవర్గంలో ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ రావడం, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి వైద్యశాఖని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా కూడా నిర్వాహకులు జాతరని ఈ తరహాలో నిర్వహించడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు.

Also read:

Indian Students Discover New Asteroids: 18 కొత్త గ్రహశకలాలను కనుగొన్న భారతీయ పాఠశాల విద్యార్థులు

Trying to weight Lose: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..