NSR Dairy Farm: అధికారుల దాడుల్లో ఎన్‌ఎస్‌ఆర్‌ గుట్టు రట్టు..! పాల లెక్కలతో పాపాల పుట్ట బయటకు..?

|

Jun 05, 2022 | 1:13 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న NSR పాల డైరీ పై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందాలు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.. పాలు, ఇతర ఆహార పదార్థాల తయారీలో నివ్వేరపోయే నిజాలు గుర్తించిన అధికారులు..

NSR Dairy Farm: అధికారుల దాడుల్లో ఎన్‌ఎస్‌ఆర్‌ గుట్టు రట్టు..! పాల లెక్కలతో పాపాల పుట్ట బయటకు..?
Nsr
Follow us on

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న NSR పాల డైరీ పై ఫుడ్ కంట్రోల్ బోర్డ్ ప్రత్యేక బృందాలు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.. పాలు, ఇతర ఆహార పదార్థాల తయారీలో నివ్వేరపోయే నిజాలు గుర్తించిన అధికారులు డైరీ ఫామ్ ను సీజ్ చేశారు.. పాల తయారీకి ఉపయోగించే రసాయనాలు సీజ్ చేసి, కల్తీ పాలు, ఇతర ఉత్పత్తులను ల్యాబ్ కు పంపారు. హనుమకొండ జిల్లా గుడెప్పాడ్ లోని ఎన్.ఎస్.ఆర్ డైరీలో రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఫుడ్ కంట్రోల్ బోర్డ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హైదరాబాద్ కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సీనియర్ సైంటిఫిక్ అధికారి లక్ష్మినారాయణ రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత తో పాటు, వరంగల్ – హనుమకొండ జిల్లాలకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఈ దాడుల్లో ప్రజారోగ్యం పాతర పెడుతున్న తీరు గుర్తించిన అధికారులు నివ్వెర పోయారు.. భారీగా గడువు దాటిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొన్ని పాల ప్యాకెట్లపై ఎటువంటి లేబుల్స్ లేక పోవడంతో వాటిని సీజ్ చేసి హైదరాబాద్ లోని ల్యాబ్ కి తరలించారు. ఎన్ఎస్ఆర్ డైరీలో కృత్రిమంగా పాలు తయారు చేస్తున్న డైరీ నిర్వహకులు.. నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు.. ఫుడ్ సేఫ్టీకి సంబందించిన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్ఎస్ఆర్ డైరీకి సంబందించిన ఫుడ్ లైసెన్స్ ను అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. డైరీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించ కూడదని ఆదేశాలు జారీ చేశారు.. ఒకవేళ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులకు గత కొద్ది నెలలుగా ఫిర్యాదు వెల్లువెత్తాయి.. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, రసాయనాలతో పాలు, పెరుగు తయారీ చేస్తూ ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్నారని ఫిర్యాదులు అందాయి..ఈ క్రమంలో అధికారులు హెచ్చరించినప్పటికీ రాజకీయ అండదండలతో డైరీ యాజమాన్యం పెడచెవిన పెట్టారని అధికారులు అంటున్నారు. దీంతో హైదరాబాద్ కు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం రంగంలోకి దిగింది.. వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి గుడెప్పాడ్ లోని ఎన్ఎస్ఆర్ డైరీపై సంయుక్తంగా దాడులు నిర్వహించారు.. ఈ దాడుల్లో డైరీలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు సరి చేసుకోవడానికి వారం రోజులు టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే తిరిగి లైసెన్స్ రివోక్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ ల్యాబ్ కు తరలించిన స్యాంపిల్స్ రిపోర్ట్ వచ్చాక.. ఆ రిపోర్ట్ ను అనుసరించి అధికారులు డైరీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ట్యాంకుల కొద్దీ త‌యార‌వుతోన్న క‌ల్తీ పాలతో ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. క్రమం తప్పకుండా ఇలాంటి డైరీల్లో సోదాలు జ‌రపాలని.. రాజకీయ అండదండలతో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఇలాంటి క‌ల్తీ రాయుల్ల ఆట కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లావాసులు కోరుతున్నారు.. కల్తీ పాలు, పెరుగు తయారీ కోసం యూరియా, డిటర్జెంట్‌, స్టార్చ్‌ పౌడర్, వాసన కోసం కొన్ని రకాల రసాయనాలను వాడుతున్నారని సమాచారం..నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కృత్రిమ పాలు తయారు చేస్తున్న ఎన్ఎస్ఆర్ డైరీ యాజమాన్యంపై కటిన చర్యలు తీసుకోకపోతే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాళ్ళా మారుతాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.