Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్‌తో భయపడాల్సిన పనిలేదంటున్న వైద్యులు.. అయినప్పటికీ..!

|

Jun 19, 2022 | 5:57 AM

Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్‌తో భయపడాల్సిన పనిలేదని వైద్యులు అంటున్నారు. కానీ కేసులు మాత్రం జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తున్నాయి.

Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్‌తో భయపడాల్సిన పనిలేదంటున్న వైద్యులు.. అయినప్పటికీ..!
Covid 19
Follow us on

Coronavirus: కరోనా ఫోర్త్ వేవ్‌తో భయపడాల్సిన పనిలేదని వైద్యులు అంటున్నారు. కానీ కేసులు మాత్రం జెట్ స్పీడ్‌లో వ్యాపిస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు అటాక్ చేస్తోంది ఏ వేరియంట్? దేశంలోకి కొత్త వేరియంట్ ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశంలో 13,216 మందికి పాజిటివ్ వచ్చింది. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, యూపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో పాజిటివిటీ రేటు 15శాతం దాటడం ఆందోళన కలిగించే అంశం.

దేశంలో పెరుగుతున్న కేసులపై ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం దృష్టి సారించింది. గత వారం రోజులుగా కేసులు ఎక్కువగా వస్తున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శాంపిల్స్‌ పంపించాలని సూచించింది. కొత్తగా వస్తున్న కేసుల్లో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ఉండడంతో కొత్తగా ఏమైనా వేరియంట్‌ వచ్చిందా? లేదంటే సబ్‌ వేరియంట్‌ ఏదైనా పుట్టుకొచ్చిందా? అనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక‍్రవారం 27,841 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 279 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 172 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇక, మేడ్చల్‌లో 20, రంగారెడ్డిలో 62, కరీంనగర్‌లో 4 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 1,781 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.