అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళా ఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం..తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో 3. కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తేలికపాటి వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా 3,4 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని జటప్రోలులో 5.2 సెంటీమీటర్లు, మహబూబ్‌నగర్‌లోని అయ్యగారిపల్లెలో 4.3 సెంటీమీటర్లు, వనపర్తిలో 3 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా ఉండనుంది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: