Telangana: ప్రియురాలిపై కన్నేశాడని స్నేహితుడినే దారుణంగా చంపాడు.. గుట్టల్లోకి తీసుకెళ్లి..

|

Mar 02, 2023 | 8:45 AM

నవీన్‌ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Telangana: ప్రియురాలిపై కన్నేశాడని స్నేహితుడినే దారుణంగా చంపాడు.. గుట్టల్లోకి తీసుకెళ్లి..
Nizamabad Crime News
Follow us on

నవీన్‌ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఐతే ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తన ప్రియురాలిపై కన్నేశాడని స్నేహితుణ్ణి అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ యువకుడు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలంలో 5 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఆంధ్రానగర్‌ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కార్తీక్‌, రాజు ఫ్రెండ్స్‌. అయితే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతిని రాజు ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ తన ప్రియురాలిపై తన స్నేహితుడైన కార్తీక్‌ కన్నేశాడనే అనుమానంతో కక్ష పెంచుకొని..తమ్ముడితో కలిసి అతన్ని చంపాలని ప్లాన్‌ వేశాడు. గతేడాది సెప్టెంబర్‌ 20న నందిపేట్‌ శివారులోని విజయనగరం గుట్టకు తీసుకెళ్లి మద్యం తాగించారు. ఆ తర్వాత కర్రలతో దాడి చేసి చంపేసి..డెడ్‌బాడీని బండరాళ్ల మధ్య పడేసి వెళ్లిపోయారు.

ఐతే తన బిడ్డ కనిపించడంలేదని కార్తీక్‌ తల్లి ఇరుగుపొరుగు వారిని ఆరా తీస్తోంది. దీంతో ఇటీవల స్థానిక యువకులు కొందరు. విజయనగరం గుట్టల్లో ఓ డెడ్‌బాడీ ఉందని కార్తీక్‌ తల్లికి చెప్పడంతో..పోలీసుల సాయంతో గుట్ట ప్రాంతంలో ఉన్న అస్థిపంజరానికి పోస్ట్‌ మార్టం నిర్వహించారు. అది కార్తీక్‌దేనని నిర్థారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..