BRS Party: కంటోన్మెంట్‌ BRS అభ్యర్థిగా నివేదిత.. ఫైనల్ చేసిన గులాబీ బాస్

సార్వత్రిక ఎన్నికల వేడిలోనే కంటోన్మెంట్‌ అసెంబ్లీ సమరం కూడా ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య నందిత మృతితో...కంటోన్మెంట్‌ స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు మే 13న ఈ అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తారు.

BRS Party: కంటోన్మెంట్‌ BRS అభ్యర్థిగా నివేదిత.. ఫైనల్ చేసిన గులాబీ బాస్
Lasya Sister

Updated on: Apr 07, 2024 | 7:58 PM

సార్వత్రిక ఎన్నికల వేడిలోనే కంటోన్మెంట్‌ అసెంబ్లీ సమరం కూడా ఆసక్తిని రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య నందిత మృతితో.. కంటోన్మెంట్‌ స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పాటు మే 13న ఈ అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని పెట్టాలా అనే అంశంపై బీఆర్‌ఎస్‌ కసరత్తు కంప్లీట్‌ చేసింది. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో, పార్టీ నేతలతో కలిసి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఎక్సర్‌సైజ్‌ చేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ భేటికి కేటీఆర్‌, హరీష్‌రావు కూడా హాజరయ్యారు. దివంగత లాస్య నందిత కుటుంబ సభ్యులతో పాటు కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని గులాబీ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ BRS అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారు చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత. కారు యాక్సిడెంట్‌లో మరణించిన లాస్య నందితకు నివేదిత సోదరి అవుతారు. ఇక ఇప్పటికే కంటోన్మెంట్ నుంచి తమ అభ్యర్థిగా శ్రీ గణేష్‌ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌. మరోవైపు కంటోన్మెంట్‌ కేండిడేట్‌పై బీజేపీ ఇంకా ఎటూ తేల్చలేదు. కమలం పార్టీ అభ్యర్థి ఎప్పుడు ఖరారవుతారా అని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం సగానికిపై పైగా సీట్లు దక్కించుకోవాలని తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే సిట్టింగ్ ఎంపీలు చేజారినా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకొని ఫిక్స్ అయ్యింది బీఆర్ఎస్.