Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

|

Oct 21, 2021 | 7:28 AM

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల సమస్యలపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..
Top 9 News
Follow us on

1. ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల సమస్యలపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలపై చర్చించనున్నారు.

2. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే. వైసీపీ ప్రభుత్వంపై కామెంట్స్‌ చేస్తే సీరియస్‌గా ఉంటదని వార్నింగ్‌ ఇచ్చారు గోపిరెడ్డి.

3. టీడీపీ నేత పట్టాభి కామెంట్స్‌పై ఏపీ వ్యాప్తంగా రగడ కొనసాగుతోంది. టీడీపీ హయాంలో కూడా గంజాయి పంట ఉన్నదన్నారు విప్‌ సామినేని ఉదయభాను. ఇప్పుడు కొత్తగా ఏమి రాలేదని, ప్రతిదాన్ని జగన్‌కు ఆపాదించడం తప్పన్నారు సామినేని.

4. కడప జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వానకు పులివెందుల పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బండులుపడ్డారు.

5. ఏపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. పోలీసుల సహకారంతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు అయ్యన్న. చంద్రబాబును ఇష్టారాజ్యంగా తిట్టినప్పుడు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు టీడీపీ సీనియర్‌ నేత.

6. దిశ కేసులో జస్టిస్ సిర్పూర్కర్‌ కమిషన్ శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డిని విచారించింది. నిందితుల ఫొటోలు మీడియాలో రావడంపై సీరియస్‌ అయ్యింది కమిషన్. గతంలో రాచకొండ సీపీ భగవత్, సజ్జనార్లను విచారించారు సభ్యులు.

7. తెలంగాణా యూనివర్సిటీలో నియామకాల వివాదం మరింత ముదిరింది. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యార్థి నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రిజిస్ట్రార్. దీంతో వర్సిటీలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

8. హనుమకొండ జిల్లాలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు పోలీసులు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ చేపట్టారు. అమరుల త్యాగాలను గుర్తుచేశారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ.

9. ఈటల రాజేందర్‌పై ఫైర్‌ అయ్యారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. అన్నింటి ధరలు పెంచిన బీజేపీలో చేరి ఈటల ఏమి చేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు హరీశ్. ఎన్నికల కమిషన్‌కు దళితబంధు ఇవ్వొద్దని బీజేపీ లేఖ రాయలేదా అని నిలదీశారు ఆర్థికమంత్రి.

Read also: Chandrababu: మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష