Covid Case: తెలంగాణలో కొత్తవేరియంట్ కలకలం.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు.. ప్రత్యేక పరీక్షలు నిర్వహణ..

| Edited By: Srikar T

Dec 21, 2023 | 4:06 PM

కరోనా మహమ్మారి మళ్ళీ హడలెత్తిస్తుంది.. దేశాన్ని షేక్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. మాస్క్ మస్ట్ చేస్తున్నారు.. ఐతే కొత్త వేరియంట్ లక్షణాలతో ఎంజీఎంకు వచ్చిన ఓ పేషెంట్‎ను అక్కడి వైద్య సిబ్బంది కోవిడ్ వార్డు‎కు తరలించారు.

Covid Case: తెలంగాణలో కొత్తవేరియంట్ కలకలం.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు.. ప్రత్యేక పరీక్షలు నిర్వహణ..
Warangal Mgm Hospital
Follow us on

కరోనా మహమ్మారి మళ్ళీ హడలెత్తిస్తుంది.. దేశాన్ని షేక్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. మాస్క్ మస్ట్ చేస్తున్నారు.. ఐతే కొత్త వేరియంట్ లక్షణాలతో ఎంజీఎంకు వచ్చిన ఓ పేషెంట్‎ను అక్కడి వైద్య సిబ్బంది కోవిడ్ వార్డు‎కు తరలించారు. ఇసోలేషన్‎లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వరంగల్‎లోని ఎంజీఎం ఆస్పత్రిలో మాస్క్ రూల్స్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించక పోతే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. ఆసుపత్రి పరిసరాల్లో నో మాస్క్ నో ఎంట్రీ పోస్టర్స్ ఏర్పాటు చేసి పేషెంట్లు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ కలవర పెడుతున్న తరుణంలో ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ఎంజీఎంలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ పేషెంట్ దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలతో ఇబ్బందులు పడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చారు. ఎంజీఎంకు రావడానికంటే ముందు ప్రైవేట్ ల్యాబ్‎లో ప్రాధమిక పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించడంతో ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు.

ఎంజీఎంలో ఇప్పటికే 50 బెడ్స్‎తో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేసిన వైద్యులు కోవిడ్ లక్షణాలతో వచ్చిన పేషెంట్‎ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న ఎంజీఎం వైద్య సిబ్బంది.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి రావాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..