Nagarjuna Sagar By-Poll 2021: సాగర్‌లో నామినేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ.. అభ్యర్థుల పేర్లను ప్రకటించని టీఆర్ఎస్, బీజేపీ

|

Mar 29, 2021 | 3:31 AM

Nagarjuna Sagar By Election 2021: తెలంగాణ రాష్ట్రమంతటా మరో ఎన్నికల వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్ సహా.. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. ఎలాగైనా మళ్లీ నాగర్జున సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని

Nagarjuna Sagar By-Poll 2021: సాగర్‌లో నామినేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ.. అభ్యర్థుల పేర్లను ప్రకటించని టీఆర్ఎస్, బీజేపీ
Nagarjuna Sagar By Poll
Follow us on

Nagarjuna Sagar By Election 2021: తెలంగాణ రాష్ట్రమంతటా మరో ఎన్నికల వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్ సహా.. ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. ఎలాగైనా మళ్లీ నాగర్జున సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణకు 30వ తేదీతో తెరపడనుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం ఇద్దరు పరిశీలకులను నియమించింది. ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా ఉత్తప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ రాహుల్ సింగ్, వ్యయ పరిశీలకుడిగా మరో ఐఎఎస్ వినయ్ చౌదరీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో నామినేషన్లపై ఇంకా ఉత్కంఠ సాగుతోంది. ఆయా పార్టీలు చివరిగా ఎవరిపేర్లను ప్రకటిస్తాయోనంటూ అటు క్యాడర్, ఇటు నాయకుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే.. టీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే ఈ సీటు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. నోముల కుటుంబం వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని నాయకులు, కార్యకర్తలు రెండురోజులుగా పేర్కొంటున్నారు. కానీ అధికార టీఆర్ఎస్ ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

కాగా.. బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. నాగర్జున సాగర్ కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో కూడా ఉత్కంఠ నెలకొంది. దుబ్బాక విజయంతో జోరుమీదున్న కమలం పార్టీ.. గట్టి పోటీనిచ్చే అభ్యర్థిని రంగంలోకి దించుతుందని నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో.. సాగర్‌ ఉపఎన్నిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం నివేదిత రెడ్డిని ఫైనల్ చేయలేదు. ఓ వైపు బీజేపీ తన అభ్యర్థి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగానే నివేదిత నామినేషన్ వేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నోముల నర్సింహయ్య కన్నుమూసిన అనంతరం సాగర్​ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఉపఎన్నికను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్​ 17న పోలింగ్​, మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే కాంగ్రెస్ జానారెడ్డి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కమ్యూనిస్టులు పేర్లను ప్రకటించలేదు.

Also Read: