Pema Khandu: రికార్డు సృష్టించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఏ సీఎం చేయని సాహాసం చేసిన పెమా ఖండు.. వీడియో

CM Pema Khandu road journey: అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు రికార్డ్ సృష్టించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157

Pema Khandu: రికార్డు సృష్టించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి.. ఏ సీఎం చేయని సాహాసం చేసిన పెమా ఖండు.. వీడియో
Pema Khandu Road Journey
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 29, 2021 | 6:12 AM

CM Pema Khandu road journey: అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖాండు రికార్డ్ సృష్టించారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. మారుమూల కొండ ప్రాంతానికి ఆయన వెళ్లి అందరి మన్ననలు పొందుతున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెమాఖండు.. అడవులు, కొండలు కొనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడిపారు. రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో విశ్రాంతి తీసుకున్నారు. అయితే సీఎం సాహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ఏ సీఎం చేరుకోని ప్రాంతానికి.. పెమాఖండు సహాసం చేసి వెళ్లారంటూ కొనియాడుతున్నారు. అయితే సీఎం జర్నీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సీఎం స్వయంగా ట్విట్ చేశారు. ఈ సహాసం చేసి రోడ్డు మార్గం ద్వారా చాంగ్లాంగ్ జిల్లాలోని విజయనగర్ చేరుకున్న మొదటి సిఎంగా పెమాఖండు నిలిచారు.

ఈ ప్రయాణంలో ఆయన వెంట క్యాబినెట్ మంత్రులు కమ్లుంగ్ మొసాంగ్, హోంచన్, పలువురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అక్కడకు చేరుకున్న సీఎం పెమాఖండు విజయనగర్ ప్రాంత వాసులకు వరాలజల్లు కురిపించారు. ఈ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తానని వెల్లడించారు. రహదారి నాణ్యతను అంచనా వేయడానికి ఈ ప్రయాణం చేపట్టానన్నారు. 2022 మార్చి నాటికి రోడ్డు మార్గాన్ని రూపొందిస్తాని తెలిపారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసేందుకు తాను వ్యక్తిగతంగా ఈ ప్రయాణాన్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనతోపాటు.. పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దీంతోపాటు ఆయన గాంధీగ్రామ్‌లో కూడా పర్యటించారు. 25వ తేదీన బయలుదేరిన సీఎం.. మొత్తం మూడు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనపై అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా పెమాఖండును అభినందించారు.

Also Read:

IND vs ENG 3rd ODI: వన్డే సిరీస్‌ కూడా భారత్‌దే.. చివరి వన్డేలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం‌

Supreme Court: విడాకులిచ్చిన భర్తకు సుప్రీం షాక్.. రూ.2.60 కోట్ల భరణం చెల్లించాలని ఆదేశాలు.. లేకపోతే..