Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..

|

Jan 18, 2022 | 2:39 PM

అసలు అక్కడ గుంతను ఎందుకు తవ్వారు..? వచ్చినవాళ్లు ఎవరు..? ఏదైనా బయటపడుతుందా..? తవ్వింది గుప్త నిధుల కోసమా..? లేక ఇంకేమైనా రీజన్ ఉందా..? ఇప్పుడే అవే ప్రశ్నలు ఆ జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Telangana: ఆదిలాబాద్ జిల్లాలో వింత గుంత కలకలం.. ఎంత తవ్వినా వీడని మిస్టరీ..
Mysterious Digging
Follow us on

ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం కుప్టి సమీపంలో కలకలం చెలరేగింది. నేషనల్ హైవేకు ఆనుకొని దాదాపు 100 మీటర్ల దూరంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. జనవరి 17 ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక జేసీబీతో పాటు ఓ ఓమ్ని వాహనంలో కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఏకంగా అక్కడ జేసీబీతో ఓ గుంత తవ్వారు. ప్రభుత్వ పనుల కోసమేమో అనుకున్నారు గ్రామస్థులు. అయితే గుంత వెంటనే పూడ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో..  అక్కడే పొలం పనులు చేసుకుంటున్న అనుమానం కలిగింది. వివరాలు వాకబు చేసే లోపే వచ్చినవాళ్లు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. దీంతో అసలు వాళ్లు ఎవరు..? గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారా..? ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారు..? గుంత తీసింది ఎందుకోసం అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఎవ్వరికీ ఏమీ అంతుబట్టలేదు. దీంతో,  విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గ్రామ పంచాయతీ కార్మికులతో తవ్వకాలు షురూ చేశారు. ఉదయం 10 గంటల నుంచి తవ్వుతూనే ఉన్నా ఎలాంటి లీడ్ దొరక్కపోవడంతో.. ఓ జేసీబీ సహాయంతో తవ్వించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ తతంగం జరిగింది. ఈ సీన్ ను చూసేందుకు చుట్టుపక్కల నుంచి వందలాది జనం చుట్టు ముట్టారు. అయితే ఎంతసేపు తవ్వకాలు జరిపినా.. ఏమీ బయటపడకపోవటం వల్ల.. నిరాశే ఎదురైంది. దీంతో అధికారులు  వెనుదిరిగారు. ఆ కారులో వచ్చినవాళ్లను పోలీసులు గుర్తించి.. వివరాలు తెలసుకుంటేనే స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై ఓ క్లారిటీ వస్తుంది.

Also Read: స్పెషల్ సాంగ్ కు ‘ఊ’ అనడానికి సామ్ ఎంత తీసుకుందో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే