Telangana: ‘మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుంది’.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చానని. మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించిన చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‎లో అభివృద్ధి పనులను పరిశీలించి, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన బాధ్యతను నెరవేర్చానని చెప్పారు.

Telangana: మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుంది.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Komati Reddy Rajagopal Redd

Edited By:

Updated on: Jun 15, 2024 | 7:28 AM

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చానని. మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించిన చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‎లో అభివృద్ధి పనులను పరిశీలించి, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన బాధ్యతను నెరవేర్చానని చెప్పారు. భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ అధిష్టానం తనపై బాధ్యత పెట్టిందని, భువనగిరి ఎంపీగా 2.28 లక్షల మెజారిటీతో గెలిపించాలని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఏ పని చెప్పినా, ఎంత కష్టమైన బాధ్యత అప్పగించిన పూర్తి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

తమ కార్యకర్తలతో సమిష్టిగా కలిసి అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త పార్టీ అధిష్టానం నుంచి త్వరలోనే వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎల్బీనగర్ నుండి పోటీ చేయమని అడిగినా నేను మునుగోడు నుండే పోటీ చేశాను. నాకు మునుగోడు ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోలేక ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మునుగోడు నుండి పోటీ చేసి గెలిచానని ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ఇంటి స్థలంలేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..