Telangana: మునుగోడులో హైటెన్షన్.. పోలీసుల అదుపులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

|

Jul 28, 2021 | 11:09 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దళిత బంధు కోసం చలో మునుగోడుకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు...

Telangana: మునుగోడులో హైటెన్షన్.. పోలీసుల అదుపులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy
Follow us on

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దళిత బంధు కోసం చలో మునుగోడుకు వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడ్డుకున్నారు. మునుగోడుకు రాకుండా అవుటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత బొంగులూరు గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రోటోకాల్ వివాదం కాస్తా పోలీస్ కేసు వరకు వెళ్లింది. అంతటితో ఆగడం లేదు. వాళ్లిద్దరి మధ్య వైరం ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సాగుతోంది. మంత్రి జగదీష్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య వార్‌ పీక్స్‌కు చేరుకుంటోంది. మొదట్నుంచి ఇద్దరి మధ్య వైరం ఉన్నప్పటికి … సోమవారం చౌటుప్పల్‌లో జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణి కార్యక్రమం మరింత పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రితో వాగ్వాదానికి దిగారు రాజగోపాల్‌రెడ్డి. అంతటితో ఆగకుండా జగదీష్‌రెడ్డి చేతిలో మైక్ లాక్కున్నారు. ఇదే ఇష్యూలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. మంత్రి జగదీష్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారని తహశీల్దార్ గిరిధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చౌటుప్పల్‌ పోలీసులు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు: రాజగోపాల్ రెడ్డి

2000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజవర్గానికి నిధులు తీసుకురాకుండా, హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు కేవలం ఈటలను ఓడించడానికి తీసుకువచ్చారని.. అంత ప్రేమ ఉంటే రాష్ట్రం మొత్తం పథకం అమలు చేయాలని సూచించారు. లేదంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

 

Also Read: వివాహిత ఇంటి ముందు వ్యక్తి సూసైడ్.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్.

ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఆ యువతి జీవితం ముగిసేలా చేసింది..