Munugode Bypoll: మునుగోడులో ముగిసిన ప్రచారపర్వం.. ఆఖరిక్షణాల్లో చిందిన నెత్తురు, ధ్వంసమైన కార్లు..

రాజకీయ యుద్ధానికి దారితీసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. నెల రోజులు నేతల ప్రచారంతో దద్దరిల్లిన మునుగోడులో ఇక అంతా ష్‌..గప్‌చుప్‌.

Munugode Bypoll: మునుగోడులో ముగిసిన ప్రచారపర్వం.. ఆఖరిక్షణాల్లో చిందిన నెత్తురు, ధ్వంసమైన కార్లు..
Munugode Elections

Updated on: Nov 01, 2022 | 6:07 PM

రాజకీయ యుద్ధానికి దారితీసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. నెల రోజులు నేతల ప్రచారంతో దద్దరిల్లిన మునుగోడులో ఇక అంతా ష్‌..గప్‌చుప్‌. చివరి రోజు మాత్రం ప్రచారం రణరంగాన్ని తలప్పించింది. ఈటల రాజేందర్‌ అత్త గారి ఊరు పలివెలలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొట్టుకోవడం తీవ్ర ఉ్రదిక్తత నెలకొంది. మరోవైపు స్థానికేతర నేతలంతా మునుగోడు వదిలి బయటకు వచ్చేస్తున్నారు. లోకల్‌ లీడర్లు తప్ప ఎవరూ ఉండకూడదన్న ఈసీ ఆదేశాలతో నెల రోజులు గ్రామాల్లోనే మకాం వేసిన నేతలంతా ఇంటి దారి పట్టారు.

ప్రచారం ముగియడంతో పోలింగ్‌ జరిగే వరకు ఉన్న సమయం మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. మరోవైపు ఎల్లుండి గురువారం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుంది.

మునుగోడు ముఖచిత్రం..

1. మునుగోడులో మొత్తం ఓటర్లు – 2,41,855.

ఇవి కూడా చదవండి

2.  పురుషులు – 1,21,720.

3. మహిళలు 1,20,128.

4. ఇతరులు ఏడుగురు.

5. బరిలో 47 మంది అభ్యర్థులు.

6. 5,686 పోస్టల్‌ బ్యాలెట్లు, దరఖాస్తు చేసుకుంది 739 మంది.

7. పోలింగ్‌ కేంద్రాలు 298, సమస్యాత్మక కేంద్రాలు 105.

8. పోలింగ్‌ సిబ్బంది 1,192 మంది.

9. పోలీసులు 3,366 మంది, కేంద్ర బలగాలు 15 కంపెనీలు.

10. వంద ప్రాంతాల్లో చెక్‌పోస్టులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..