Munugode Bypoll: కేంద్ర బలగాల చేతిలో మునుగోడు అష్టదిగ్బంధం.. ఏ ఒక్కరినీ వదలకుండా తనిఖీలు..

|

Oct 20, 2022 | 8:14 PM

కేంద్ర బలగాల చేతిలో మునుగోడు అష్టదిగ్బంధంగా మారింది. టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల..

Munugode Bypoll: కేంద్ర బలగాల చేతిలో మునుగోడు అష్టదిగ్బంధం.. ఏ ఒక్కరినీ వదలకుండా తనిఖీలు..
Munugode Checkings
Follow us on

కేంద్ర బలగాల చేతిలో మునుగోడు అష్టదిగ్బంధంగా మారింది. టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల సహా అనుమానం వచ్చిన ఏ ఒక్కరి కార్లు, వాహనాలను వదలకుండా తనిఖీ చేస్తున్నారు. అవును, మునుగోడు బైపోల్‌ నేపథ్యంలో కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. కీలక ప్రాంతాల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. ఉపఎన్నికల వేళ మద్యం, డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు బలగాలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలో మొత్తం 28 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విఐపీ వాహనాలను కూడా కేంద్ర బలగాలను తనిఖీ చేస్తున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా, పంతంగి టోల్ ప్లాజా దగ్గర కేంద్ర బలగాలు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అలాగే మునుగోడు శివారు ప్రాంతాలతోపాటు యాదాద్రి, నల్గొండజిల్లాలో 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

మునుగోడు బైపోల్‌ను ప్రధానపార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సెంట్రల్‌ ఫోర్స్‌ టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులను సైతం వదలడం లేదు. హైవేపై రెండు టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వచ్చిన మంత్రి మల్లారెడ్డి కారును కూడా తనిఖీలు చేశారు. అరెగూడెం వెళ్తున్న మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను ఆపి తనిఖీలు నిర్వహించాయి.

ఇక పలిమెల చెక్‌పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ని ఆపి చెక్ చేశారు పోలీసులు. బ్యాగులను పరిశీలించారు. అంతేకాదు మంత్రి వెంట కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను సోదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పోలీసులకు దగ్గర ఉండి సహకరించారు. ఏదిఏమైనా మునుగోడు బైపోల్‌ నేపథ్యంలో పెద్దఎత్తున నగదు పట్టుబడుతుండంతో కేంద్ర బలగాలు ఎంటరయ్యాయి. మునుగోడును అష్టదిగ్బంధం చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..