Munugode Bypoll: బీజేపీకి బిగ్ షాక్.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కీలక నేత.. త్వరలోనే టీఆర్ఎస్‌లోకి జంప్..

|

Oct 23, 2022 | 11:09 PM

మునుగోడు ఉపఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.

Munugode Bypoll: బీజేపీకి బిగ్ షాక్.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన కీలక నేత.. త్వరలోనే టీఆర్ఎస్‌లోకి జంప్..
Rapolu Ananda Bhaskar
Follow us on

మునుగోడు ఉపఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. ఇప్పుడు మరో ముఖ్య నేత పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీజేపీ నేత రాపోలు ఆనంద్ భాస్కర్.. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చాలాసేపు ముఖ్యమంత్రితో మంతనాలు జరిపారు. భేటీ అనంతరం మాట్లాడిన ఆయన.. బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్లు చెప్పారు ఆనంద్ భాస్కర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును తాను వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. చేనేత సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారని రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రశంసలు కురిపించారు. కాగా, బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాపోలు.. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, చేరికపై ఆయన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. మునుగోడు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ, టీఆర్ఎస్.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి కీలక నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీని బీజేపీలో చేరారు. ఈ చేరిక రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీజేపీలో కాస్త జోష్‌ను పెంచింది.

అయితే, ఆ జోష్ ఎంతో కాలం నిలిచిఉండలేదు. గులాబీ దళపతి మంత్రాంగం ముందు జోష్ తుస్సుమంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దాసోజు శ్రావణ్, స్వామి గౌడ్ ఇద్దరు కూడా మళ్లీ టీఆర్ఎస్‌ గూటికి చేరారు. బీజేపీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఒకేరోజు ఇద్దరు నేతలు బీజేపీని వీడటం పొలిటికల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వీరి బాటలోనే మరో బీజేపీ నేత రాపోల్ ఆనంద్ భాస్కర్ పయనిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..