AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చూశారా ఈ చిత్రం.. తల్లిపై పోటీకి దిగిన కూతురు.. ఇద్దరికీ ప్రధాన పార్టీల మద్దతు

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవికి తల్లీ–కూతురు ఎదురెదురుగా బరిలో దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో తల్లి గంగవ్వ, ఆమె కూతురు సుమలత ఇద్దరూ పోటీకి సై అన్నారు .

Telangana: చూశారా ఈ చిత్రం.. తల్లిపై పోటీకి దిగిన కూతురు.. ఇద్దరికీ ప్రధాన పార్టీల మద్దతు
Gangavva - Sumalatha
G Sampath Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 02, 2025 | 5:23 PM

Share

తెలంగాణలో స్థానిక ఎన్నికల సంబరం నడుస్తోంది. పల్లెల్లో ఆసక్తికర సీన్స్ కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో బంధుత్వాన్నీ కూడా పట్టించుకోవడం లేదు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. పంచాయితీ ఎన్నికల్లో అన్నాతమ్ముళ్లు, బావామరుదులు.. వేరు వేరు పార్టీల మద్దతులో తలపడటం ఇప్పటివరకు చూశారం. తాజాగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఏకంగా తల్లిపై కూతురే పోటీకి దిగింది. దీంతో పోరు రసవత్తరంగా మారింది. మరి తల్లి గెలుస్తుందా..కూతురు గెలుస్తుందా..? అన్న చర్చ గ్రామస్థుల్లో నడుస్తోంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లె గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తల్లీ కూతురు మధ్య.. ఆసక్తికర పోరు నెలకొంది. తిమ్మయ్య పల్లె రిజర్వేషన్ బీసీ మహిళకు వెళ్లింది. దీంతో తల్లి శివరాత్రి గంగవ్వ.. బరిలోకి దిగగా..  ఆమె కూతురు సుమలత సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లికి బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించగా.. కూతుర్ని అధికార కాంగ్రెస్ బలపరిచింది. ఇప్పుడు..ఈ ఇద్దరు.. విడివిడిగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. సుమలత..ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి..పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి.. ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు..రిజర్వేషన్ అనుకూలించడంతో.. పోటీకి సై అంటున్నారు. మిగతా అభ్యర్థులు కొందరు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న.. తల్లి, కూతురు పోటీపైనే ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇప్పటికే ఇరువరూ ఇంటింటి ప్రచారాన్ని ఉదృతం చేశారు. కులాలవారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశాన్ని వదలకుండా.. ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. తల్లి, కూతురు చేస్తున్న ప్రచారాన్ని చూడటానికి ఇతర గ్రామస్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లికూతురు మధ్య..ఇలాంటి పోరు ఉండటం చాలా అరుదు. మరి.. ఈ సర్పంచ్ ఎన్నికల్లో..ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం