అయ్యో పాపం.. నెలన్నర పసికందు సహా ఇద్దరు కొడుకుల్ని చంపిన తల్లి.. ఉరివేసుకుని ఆత్మహత్య..

ప్రేమలకు రెండో కుమారుడు జన్మించిన తరువాత తాను ఇటీవల అత్తారింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నిజాంపేట్‌లోని పుట్టింటికి పిల్లలతో సహా వచ్చింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి చంపేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

అయ్యో పాపం.. నెలన్నర పసికందు సహా ఇద్దరు కొడుకుల్ని చంపిన తల్లి.. ఉరివేసుకుని ఆత్మహత్య..
Mother's Suicide

Updated on: Sep 06, 2025 | 1:29 PM

సంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోఇన నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ లో ఇద్దరు చిన్నారుల సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నెలన్నర కొడుకు సహా.. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకోవటంతో గ్రామంలో ఎటు చూసినా విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం..

సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన బూషి ప్రేమల(22) దామరచెరువుకు చెందిన కొత్తపల్లి సంగమేశ్వర్‌లకు మూడున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల ధనుష్‌, నెలన్నర సూర్యవంశీ ఇద్దరు కుమారులు. ప్రేమలకు రెండో కుమారుడు జన్మించిన తరువాత తాను ఇటీవల అత్తారింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నిజాంపేట్‌లోని పుట్టింటికి పిల్లలతో సహా వచ్చింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి చంపేసి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో విగత జీవులుగా పడివున్న తల్లీ కొడుకుల్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషాద ఘటనకు కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..