Telangana Assembly: నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..!
మంగళవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు వెల్లడించారు. సమావేశాలతోపాటు.. తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది.
Telangana Assembly Monsoon Session: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 3న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై కీలకంగా చర్చించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు వెల్లడించారు. సమావేశాలతోపాటు.. తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది. మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సెషన్‌కు కొనసాగింపుగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ఉండనున్నాయి. బడ్జెట్ సెషన్ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. సభను ప్రోరోగ్ చేయలేదు. దీంతో దీనికి కొనసాగింపుగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతోపాటు పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నిధులు, ప్రభుత్వ విధానాలపై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ తీరును టీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా.. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన సంగి తెలిసిందే. అయితే, రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేస్తుంది. కావున ఈ విషయంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనపై కూడా చర్చించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..