AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతుల యుద్ధం మనుషుల చావుకొచ్చింది.. వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి..!

కరీంనగర్‌ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. మంకమ్మతోటలో వృద్ధురాలిని వెంటాడి మరీ దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల నుంచి తమకు విముక్తి కల్పించాలని నగర వాసులు కోరుతున్నారు.

కోతుల యుద్ధం మనుషుల చావుకొచ్చింది.. వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి..!
Monkeys Attack Elderly Woman
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 18, 2025 | 5:28 PM

Share

కరీంనగర్‌ జిల్లాలో కోతులు రెచ్చిపోతున్నాయి. మంకమ్మతోటలో వృద్ధురాలిని వెంటాడి మరీ దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో కోతులు వీరంగం సృష్టిస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంకమ్మతోటలో వృద్దురాలుపై కోతులు దాడి చేశాయి. ఇంటిముందు నిల్చున్న వృద్ధురాలు ఆగమ్మ కొంగుపట్టి ఓ కోతి లాగగా, మరో కోతి ఆమెపై దూకి కింద పడేశాయి. ఒక్కసారిగా పదుల సంఖ్యలో కోతులు ఎగబడ్డాయి. వెంటనే స్థానికులు కర్రలు పట్టుకుని అరుస్తూ బెదిరించడంతో కోతులు ఆమెను వదిలిపెట్టాయి. లేకుంటే వృద్ధురాలి ప్రాణం తీసేవి.

అటు సైదాపూర్ మండలం కేంద్రంలోని వెంకేపల్లి లో వానర సైన్యం దండు కట్టి ఘర్షణ పడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కోతులు పరస్పరం ఘర్షణ పడి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశాయి. దారిలోనే కిష్కిందకాండల వానర సైన్యం ఘర్షణ పడడంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోక నిలిచిపోయాయి‌. కోతుల బెడదతో వేగలేక పోతున్నామని, అధికారులు కోతులు నివారించే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో తరుచూ కోతులు జనంపై దాడికి దిగుతున్నాయి. బయట రావాలంటే జనం భయపడుతున్నారు. కోతుల నుంచి తమకు విముక్తి కల్పించాలని నగర వాసులు కోరుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!