
మంత్రి పదవులు ఊరికే రావు. ‘అదృష్టం వరించింది, ఆయనకో.. ఆమెక.. మంత్రి పదవి వచ్చింది’ అంటుంటారు. కాదు. ఒక్క మంత్రి పదవి వెనక ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్‌లో ఫిట్ అయ్యే వారికే మంత్రి పదవి దక్కుతుంది. మరి… అన్ని సమీకరణాలున్నా కాలం కలిసిరాకపోతే? బుగ్గకారులోకి ఎక్కే ఛాన్స్ ఇవ్వకపోతే. అలాంటి వాళ్లే ఒక్కోసారి ‘పెద్ద లీడర్’ అవుతారు. ఓ పార్టీకి అధినేత అవుతారు. ఏ పార్టీ అయితే మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించిందో.. ఆ పార్టీని రాష్ట్రంలోనే లేకుండా చేస్తారు. చేశారు కూడా. ఎగ్జాంపుల్స్ కావాలా? ఈ ఎపిసోడ్ అంతా అదే. చెప్పుకుందాం. కాకపోతే.. ఒక్క మంత్రి పదవి ఎందుకని కొన్నిసార్లు మంత్రదండం అవుతోంది. అంతగా లైమ్‌లైట్‌లో లేని అజారుద్దీన్‌ను తీసుకొచ్చి, సడెన్‌గా క్యాబినెట్‌లో కూర్చోబెట్టాక ‘మంత్రి పదవి నిజంగా మంత్రదండమే’ అనే ఆలోచన కలిగించింది. ఒక్కోసారి ప్రభుత్వాన్ని నిలబెట్టేది ఆ ఒక్క మంత్రి పదవే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టేది కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే. ఇంతకీ, ఆ మంత్రదండం అందుకున్న నేతలెవరు? ఒక్కసారి 2023 ఎన్నికలకు వెళ్దాం. అప్పట్లో బీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలే. అయినా సరే.. జూబ్లీహిల్స్‌లో పోటీ చేసింది ఎంఐఎం. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత ప్రభుత్వం మారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే.. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్నా జూబ్లీహిల్స్‌లో పోటీ చేసిన...