AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టరీగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసి ఉందంటే?

తల్లితండ్రులను వదిలి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అనుకున్నది సాధించలేక అసువులు బాస్తున్నారు. ఉన్న ఊరుని వదిలి దూరంగా ఉన్న కాలేజీలకు వచ్చి చేరి, చిన్న, చిన్న కారణాలకే కళాశాలలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.. తాజాగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ(JNTU)లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

మిస్టరీగా మారిన ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసి ఉందంటే?
Engineering Student
P Shivteja
| Edited By: |

Updated on: Oct 31, 2025 | 8:21 PM

Share

తల్లితండ్రులను వదిలి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న అనుకున్నది సాధించలేక అసువులు బాస్తున్నారు. ఉన్న ఊరుని వదిలి దూరంగా ఉన్న కాలేజీలకు వచ్చి చేరి, చిన్న, చిన్న కారణాలకే కళాశాలలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.. తాజాగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్టీయూ(JNTU)లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన మహేశ్ శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా రూమ్‌కే పరిమితమైన మహేశ్, ఇవాళ తోటి స్టూడెంట్స్ క్లాసులకు వెళ్లిన తర్వాత తలుపులు బిగించుకొని సూసైడ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం రూంకు తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు ఉరి వేసుకున్న మహేష్‌ను గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మహేష్‌ను కిందికి దింపి సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.

కాగా, మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరకడంతో యూనివర్సిటీ సిబ్బంది తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ లేఖలో ఏం రాశాడు.. అనేది ఇప్పుడు అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది. అసలు మహేష్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియరాలేదు. జేఎన్టీయూహెచ్‌లో మూడో సంవత్సరం చదువుతున్న మహేష్ మృతి ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ డెత్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..
నిరుద్యోగులకు బిగ్ షాక్.. ఆ డిగ్రీలు ఇక చెల్లవు..