MLC Kavitha: నిజామాబాద్‌ అంతటా గులాబీ జెండా ఎగురవేస్తాం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..

Nizamabad News in Telugu: ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్‌ జిల్లా అంతటా గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గులాబీ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

MLC Kavitha: నిజామాబాద్‌ అంతటా గులాబీ జెండా ఎగురవేస్తాం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..
Mlc Kavitha

Updated on: Jun 07, 2023 | 3:58 PM

Nizamabad News in Telugu: ప్రజల ఆశీర్వాదంతో నిజామాబాద్‌ జిల్లా అంతటా గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ గులాబీ పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ కుటుంబం పెద్దది, కేసీఆర్ మనసు పెద్దది.. గులాబీ కండువా కప్పుకుంటే ప్రజలకు గులాంలాగా పని చేయాలన్నారు. గులాబీ కండువాపై అందరికీ నమ్మకం ఉండాలంటూ కార్యకర్తలకు సూచించారు. కొన్ని పార్టీలు, నాయకులు నినాదాలు చెప్తారు.. కానీ నిజం ఉండదు.. జవాన్లకు, కిసాన్లను ఆదుకుంటున్న ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే మహాసముద్రని.. ఎవరూ ఏం చేయలేరంటూ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 23శాతం ప్రసవాలు మాత్రమే జరిగేవని.. ఇప్పుడు తెలంగాణలో 66% ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఏం కావాలని.. ఎప్పుడూ సీఎం కేసీఆర్ ఆలోచిస్తునే ఉంటారంటూ పేర్కొన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుంటుందంటూ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తాయని.. సోషల్ మీడియాలో మనం నిజాలు చెప్పాలంటూ కార్యకర్తలకు సూచించారు. నిజం చెప్పండి.. గౌరవిస్తాం.. అబద్ధం చెప్తే ఊరుకోమంటూ కాంగ్రెస్, బీజేపీని విమర్శించారు. ఎవరెస్టు శిఖరం లాంటి కేసీఆర్ మనకు ఉన్నారని.. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామంటూ కవిత స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం