MLC Kavitha: బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు.. టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత..

|

Mar 03, 2023 | 10:04 PM

మహిళా రిజర్వేషన్ బిల్లుకై పోరుబాట పట్టిన ఎమ్మెల్సీ కవిత.. టీవీ9 ర్యాపిడ్ ఫైర్‌లో రజినికాంత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు మాట్లాడారు. లిక్కర్ స్కామ్ సహా బీజేపీ ప్రభుత్వ విధానాలు..

MLC Kavitha: బీజేపీ అసలు టార్గెట్ నేను కాదు.. టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత..
Mlc Kavitha Interview
Follow us on

మహిళా రిజర్వేషన్ బిల్లుకై పోరుబాట పట్టిన ఎమ్మెల్సీ కవిత.. టీవీ9 ర్యాపిడ్ ఫైర్‌లో రజినికాంత్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు మాట్లాడారు. లిక్కర్ స్కామ్ సహా బీజేపీ ప్రభుత్వ విధానాలు, దేశ రాజకీయాలు, సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తున్న తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూనే.. దీనివెనుక భారీ రాజకీయ కుట్ర దాగుందని అన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతటి స్థాయికైనా దిగజారుతుందని, ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ టార్గెట్ చేసుకున్న రాష్ట్రాలకు ముందుగా ఈడీ, సీబీఐ వస్తుందన్నారు.

బీజేపీ ప్రేరేపిత కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే తనపై వస్తున్న ఆరోపణలకు, విచారణకు సంస్థలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ నేతల రాజకీయ ఆరోపణలే తప్ప.. వాస్తవాలు లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్‌గానే.. ఈ కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదన్నారు. ఇలాంటి మరెన్నో అంశాలు గురించి తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి..

కవిత ఇంటర్వ్యూని కింది వీడియోలో చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..