MLC Kavitha: దేశంలో డిగ్రీ లేని వారికి అత్యున్నత ఉద్యోగం.. కవిత చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి.?

|

Apr 02, 2023 | 4:38 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌ చేశారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందన్న కవిత.. యువతకు ఏటా 2..

MLC Kavitha: దేశంలో డిగ్రీ లేని వారికి అత్యున్నత ఉద్యోగం.. కవిత చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి.?
Mlc Kavitha
Follow us on

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌ చేశారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందన్న కవిత.. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. యువత పట్ల ఏమైనా ఆందోళన, యువత శక్తి, సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా? అన్నారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించిన కవిత.. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఈడీ విచారణ తదనంతర పరిణామల నేపథ్యంలో కవిత ఈ స్థాయిలో విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరి ఎమ్మెల్సీ కవిత మోదీని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే మోదీ డిగ్రీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విమర్శించిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..