MLC Kavitha: మహిళా బిల్లుపై తగ్గేది లే.. ఢిల్లీ దీక్ష అనంతరం తేల్చి చెప్పిన కవిత

|

Mar 10, 2023 | 4:24 PM

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన దీక్ష ముగిసింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్షను కవిత సాయంత్రం 4 గంటలకు విరమించారు...

MLC Kavitha: మహిళా బిల్లుపై తగ్గేది లే.. ఢిల్లీ దీక్ష అనంతరం తేల్చి చెప్పిన కవిత
Mlc Kavitha
Follow us on

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి.. ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ… ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఢిల్లీలో చేపట్టిన దీక్ష ముగిసింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్షను కవిత సాయంత్రం 4 గంటలకు విరమించారు. ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన కవిత… ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు.

ఇక నిరాహార దీక్ష ముగిసిన తర్వాత మాట్లాడిన కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమన్న కవిత.. వచ్చే పార్లమెంట్‌లో సమావేశాల్లో బిల్లు పాసయ్యేలా, అందరం కలిసి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. మహిళల రిజర్వేషన్‌ కోసం ఇది పోరాట సమయమని అభివర్ణించిన కవిత, చిన్నగా మొదలైన ఈ ఉద్యమం..దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు.

మహిళలకు అవకాశం ఇస్తే, అన్నింట్లో రాణిస్తారన్న ఎమ్మెల్సీ కవిత.. ఉద్యమానికి మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక మహిళా బిల్లుపై తగ్గేది లేదని తేల్చి చెప్పిన కవతి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ముర్ము మహిళా బిల్లుపై ఈ ఏడాది జరిగే పార్లమెంట్‌ చివరి సెషన్‌లో రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేలా ఒత్తిడి తేవాలని కవిత డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..