Rajaiah vs Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్‌ నీదా.. నాదా..? దమ్ముంటే తేల్చుకుందాం రా.. కౌంటర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌..

MLA Rajaiah vs MLC Kadiyam Srihari: జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజకీయం కాకరేపుతోంది. ఒకవైపు MLA తాడికొండ రాజయ్య... ఇంకోవైపు MLC కడియం శ్రీహరి, ఇద్దరి మధ్య హాట్‌ అండ్‌ హీట్‌ ఫైట్‌ జరుగుతోంది.

Rajaiah vs Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్‌ నీదా.. నాదా..? దమ్ముంటే తేల్చుకుందాం రా.. కౌంటర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌..
Kadiyam Srihari Rajaiah

Updated on: Jul 10, 2023 | 6:11 PM

MLA Rajaiah vs MLC Kadiyam Srihari: జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజకీయం కాకరేపుతోంది. ఒకవైపు MLA తాడికొండ రాజయ్య… ఇంకోవైపు MLC కడియం శ్రీహరి, ఇద్దరి మధ్య హాట్‌ అండ్‌ హీట్‌ ఫైట్‌ జరుగుతోంది. స్టేషన్ ఘన్‌పూర్‌ సీటు నీదా.. నాదా..? తేల్చుకుందాం రా.. అన్నట్టుగా ఇద్దరు అధికార పార్టీ నేతలు తలపడుతున్నారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా జరుగుతోన్న ఈ వార్‌.. ఇప్పుడు మరో కొత్త టర్న్‌ తిరిగింది. కడియంపై రాజయ్య పర్సనల్‌ ఎటాక్‌కి దిగడంతో ఘన్‌పూర్‌ మరింత హీటెక్కిపోతోంది.

కడియం.. అస్సలు ఎస్సీనే కాదంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతేకాదు, అక్రమంగా రిజర్వేషన్లు వాడుకుంటోన్న కడియంపై దళిత సంఘాలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజయ్య వ్యాఖ్యలకు అంతే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు కడియం. నా కుటుంబంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావ్‌, నేను నీ కుటుంబం గురించి మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటారంటూ వార్నింగ్‌ ఇచ్చారు. నా తండ్రి ఎస్సీ.. తల్లి బీసీ అంటూ కడియం మీడియాతో స్పష్టంచేశారు. అసమర్థ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ సూచించారు. తండ్రి వారసత్వమే ఎరికైనా వస్తుందంటూ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాజయ్య కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఘన్‌పూర్‌లో నాకు నేనే పోటీ, 119 నియోజకవర్గాల్లోనే టాప్‌లో ఉన్నా.. ఘన్‌పూర్‌లో అధికారపక్షం నేనే, ప్రతిపక్షం కూడా నేనే.. కడియం మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల దగ్గర పిడికెడు మట్టి కూడా తీయలేదు.. ఇప్పుడేమో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరి మధ్య జరుగుతోన్న హాట్‌ అండ్‌ హీట్‌ డైలాగ్‌ వార్‌ తో వరంగల్ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, దీనిపై పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..