
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్దకు వెస్ట్ జోన్ పోలీసులు చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నానంటూ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్‌హట్ పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్‌పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజా సింగ్ స్పందించారు. పాత కేసుల్లో తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిన్ననే నోటీసులు సిద్ధం చేసి ఈ ఉదయం అందించారని చెప్పారు. కేసులు నమోదైన ఆర్నెళ్ల నుంచి పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజా సింగ్‌పై కేసు నమోదైందన సంగతి తెలిసిందే.. అసిస్టెంట్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 19న మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టేలా పాట పాడారని షాహినాయత్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇది ఇలా ఉంటే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై భవానీనగర్, డబీర్‌పురా, రెయిన్ బజార్ పీఎస్‌లతోపాటు రాష్ట్రవ్యాప్తంటా పలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో రాజాసింగ్ పెట్టిన వీడియోపై ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. వారి మనోభావాలు దెబ్బతీశారంటూ పోలీసుస్టేషన్ల ఎదుట నిరసనలు చేశాయి. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్టు అవడం హాట్‌టాపిక్ గా మారింది. గతంలో కమ్యూనల్ వాయిలెన్స్ విషయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని కేసులను తవ్వితీసిన పోలీసులు…మళ్లీ రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే అంతకు ముందు.. మరోవైపు అరెస్టుకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. మునావర్ ఫారుఖీ వల్లే హైదరాబాద్‌లో కమ్యూనల్ వాయిలెన్స్ జరిగాయన్నారు MLA రాజాసింగ్. రాముడు, సీతాను తిట్టే వ్యక్తిని హైదరాబాద్‌కు తీసుకురావొద్దని సీఎం కేసీఆర్, కేటీఆర్, డీజీపీకి రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే మునావర్‌ను రప్పించారని రాజాసింగ్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం