Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అంశంలో బిగ్ అప్‌డేట్.. మరికాసేపట్లోనే ఆ ప్రకటన..!

Rajagopal Reddy: పార్టీ మారుతారా? మారరా?.. ఆయన బీజేపీలో వెళ్తారా? వెళ్లరా?.. వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? చేయరా?..

Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అంశంలో బిగ్ అప్‌డేట్.. మరికాసేపట్లోనే ఆ ప్రకటన..!
Komatireddy Rajagopal Reddy

Edited By:

Updated on: Aug 02, 2022 | 7:03 PM

Rajagopal Reddy: పార్టీ మారుతారా? మారరా?.. ఆయన బీజేపీలో వెళ్తారా? వెళ్లరా?.. వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? చేయరా?.. ఈ ప్రశ్నలన్నీ ఎవరి గురించో ఈపాటికే అర్థం అయ్యి ఉంటుంది. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించే. ఇంతకాలం ఊరిస్తూ వచ్చిన ఆయన.. మరికాసేపట్లో బిగ్ అనౌన్స్ చేయబోతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ప్రకటనను మరికాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఉప ఎన్నికతోనే మునుగోడు అభివృద్ధికి నిధులు వస్తాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడు వేదిక నుంచే కేసీఆర్‌పై పోరాటం ప్రారంభిస్తానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం అయ్యారు. మొత్తానికి కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తూ, ఊగిసలాడుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మరికొద్దిసేపట్లో బీజేపీలో చేరిక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై స్పష్టమైన ప్రకటన చేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి