Telangana: జస్ట్ ఫ్రెండ్స్.! ఇద్దరూ వాట్సాప్‌లో చాటింగ్.. కట్ చేస్తే.. యువతి తండ్రి ఏం చేశాడంటే

ఆ ఇద్దరూ మైనర్లు.. ప్రతీ రోజూ క్లాసులో జరిగిన విషయాలను ఇద్దరూ వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలియక మైనర్ బాలిక కుటుంబ సభ్యులు.. ఆ బాలుడిని మందలించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఈ వార్తలో చూసేయండి.

Telangana: జస్ట్ ఫ్రెండ్స్.! ఇద్దరూ వాట్సాప్‌లో చాటింగ్.. కట్ చేస్తే.. యువతి తండ్రి ఏం చేశాడంటే

Edited By:

Updated on: Feb 18, 2025 | 4:02 PM

ఇద్దరు మైనర్ల మధ్య వాట్సాప్ చాటింగ్ చివరికి.. ఆ మైనర్ బాలుడు ప్రాణం తీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక చుంచుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్(15) అదే స్కూల్‌లో చదువుతున్న బాలికతో వాట్సాప్‌లో చాటింగ్ చేశాడు. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు.. బాలుడికి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయాందోళనకు గురై బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. చుంచుపల్లితండా ప్రాంతానికి చెందిన బాదావత్ రమేష్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కుమారుడు మనోజ్(15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మనోజ్‌కు అదే స్కూల్‌లో చదువుతున్న మైనర్ బాలికతో స్నేహంగా ఉంటూ తరుచూ ఫోన్‌లో వాట్సాప్ చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో గత శనివారం చాటింగ్ చేయగా, గమనించిన ఆ మైనర్ బాలిక కుటుంబసభ్యులు వెంటనే మనోజ్‌కు ఫోన్ చేసి హెచ్చరించారు. తమ అమ్మాయితో ఎందుకు చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించారు. దీంతో మనస్థాపం చెందిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించమన్నారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు మనోజ్. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చుంచుపల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..