
Telangana, October 03: తెలంగాణలో బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. సుడిగాడి పర్యటనలు జనరంజక ప్రకటనలతో జోడు గుర్రాల్లా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్. కాంగ్రెస్, బీజేపీ నేతలకు కౌంటర్ ఇస్తూ క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పలు కార్యక్రమాలతో దూకుడు పెంచాయి. ఎన్నిక కోడ్ రాకముందే పలు జిల్లాలో సుడిగాల పర్యటనలు చేస్తూ నేతల్లో, క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. జనరంజక ప్రకనలు చేస్తూ జోడు గుర్రాల వలే జిల్లాలో సవారీ చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు మంత్రులు మంత్రులు హరీష్, కేటీఆర్. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించారు కేటీఆర్. 530 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు కేటీఆర్. దళిత బంధు లబ్ధిదారులకు చెక్‌లను పంపిణీ చేశారు కేటీఆర్.
రాష్ట్రంలో 24గంటల కరెంట్‌పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. అటు పాలమూరులో ప్రధాని మోదీ చేసిన వారసత్వ రాజకీయాలపై ఫైర్ అయ్యారు కేటీఆర్. జగదీశ్వర్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు
మెదక్ జిల్లాలో పర్యటించారు మంత్రి హరీష్‌రావు, సిద్ధిపేట, దుబ్బాక, రామాయంపేటలో హరీష్‌రావు సుడిగాలి పర్యటనలు చేశారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు అంటూ సెటైర్లు వేశారు మంత్రి హరీష్. వారంటీ లేని పార్టీలిచ్చే గ్యారంటీల్ని నమ్మొద్దు అంటూ అటు కాంగ్రెస్‌కు, ఉత్తతి ప్రకటనలను చేసే బీజేపీని నమ్మోద్దంటూ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ధీమా వ్యక్తంచేశారు మంత్రులు.
🌟 Nalgonda Joins Telangana’s IT Growth Journey!
🎉 Ministers @KTRBRS and @jagadishBRS have inaugurated a state-of-the-art IT Tower in Nalgonda.
🏢 The impressive G+5 floor building, spanning 1.78 lakh square feet, can accommodate up to 1,008 employees.
🏗️ The Telangana… pic.twitter.com/Y3V6Ca1uMr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 2, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..