PM Narendra Modi: రేపే హైదరాబాద్‌ కు ప్రధాని.. ప్రభుత్వం తరపున మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..

|

Feb 05, 2022 | 6:35 AM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్‌ (Hyderabad) పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌ లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi)

PM Narendra Modi: రేపే హైదరాబాద్‌ కు ప్రధాని.. ప్రభుత్వం తరపున మోడీకి స్వాగతం పలకనున్న ఆ మంత్రి..
Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్‌ (Hyderabad) పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌ లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi) వేడుకలతో పాటు పటాన్‌ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈమేరకు శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకునున్నారు. అదేవిధంగా పర్యటన పూర్తయ్యాక ప్రధానికి వీడ్కోలు చెప్పే బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

మొదట ఇక్రిశాట్ కు..

హైదరాబాద్​ రానున్న ప్రధాని 5వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ ను సందర్శించి వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్​లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ఆవిష్కరించి.. జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో రామానుజాచార్య జీవన ప్రయాణం, ఆయన బోధనలకు సంబంధించిన 3డి ప్రజెంటేషన్ మ్యాపింగ్ ప్రదర్శిస్తారు. 108 దివ్య క్షేత్రాల నిర్మాణాలను కూడా ప్రధాని మోడీ సందర్శించనున్నారు.

 

Also Read:Coronavirus: బిగ్‌ బీ ఇంట్లో మళ్లీ కరోనా కలకలం.. జయా బచ్చన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌..

Budget 2022 : ‘అమృత కాలంలో అడుగు పెడుతోన్న నవ భారతానికి బూస్టర్ ఈ బడ్జెట్’..

AHA Unstoppable: మంచు లక్ష్మి, విష్ణు.. వీరిద్దరిలో మీ డబ్బును ఎవరు బాగా ఖర్చు పెడతారు ? బాలయ్య ప్రశ్నకు మోహన్‌బాబు సమాధానం ఏమిటంటే..