Telangana: తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు ఆస్కార్‌ నిదర్శనం.. కొత్త చర్చకు తెర తీసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

|

Mar 13, 2023 | 12:21 PM

అందరూ ఊహించినట్లుగానే, అందరూ కోరుకున్నట్లుగానే ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ మూవీ. నాటు నాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై సామాన్య...

Telangana: తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు ఆస్కార్‌ నిదర్శనం.. కొత్త చర్చకు తెర తీసిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
Minister Srinivas Goud
Follow us on

అందరూ ఊహించినట్లుగానే, అందరూ కోరుకున్నట్లుగానే ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిందీ మూవీ. నాటు నాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్ఉతన్నారు. రాష్ట్రపతి మొదలు ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ట్రిపులార్ యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక సినీ ప్రముఖులు సైతం ఆస్కార్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇదే సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సరికొత్త చర్చకు దారి తీశారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి.. ఆస్కార్‌ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపిందని ఆరోపించారు. నార్త్‌ ఇండియా సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత సౌత్ ఇండియా సినిమాలకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ట్రిపులార్‌ను ఆస్కార్‌కు అధికారికంగా ఎందుకు పంపలేదన్నారు. గుజరాత్ సినిమాను ఆస్కార్‌కు పంపి.. ట్రిపులార్‌ను పంపకపోవడం తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు సాక్ష్యం అని ఆరోపించారు. తెలుగు వారిపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ మంత్రి ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఆస్కార్‌ అవార్డులకు భారత్‌ నుంచి ‘ఛెల్లో షో’ అనే గుజరాతీ సినిమాను పంపించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ సొంతంగా ఆస్కార్ బరిలోకి దిగింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటు నామినేట్ అయింది. అవ్వడమే కాదు ఆస్కార్‌ను కూడా కొట్టేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..