AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అంగన్వాడీ చిన్నారుల కోసం ప్రభుత్వం సరికొత్త స్కీమ్.. దేశంలోనే తొలిసారిగా..

అంగన్వాడీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు రోజూ 100 మి.లీ విజయ పాలను పంపిణీ చేసే పైలట్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆమె కీలక విషయాలు వెల్లడించారు.

Telangana: అంగన్వాడీ చిన్నారుల కోసం ప్రభుత్వం సరికొత్త స్కీమ్.. దేశంలోనే తొలిసారిగా..
Anganwadi Milk Scheme For Child Nutrition
Krishna S
|

Updated on: Nov 17, 2025 | 6:07 PM

Share

అంగన్వాడీ చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ ప్రీస్కూల్ చిన్నారులకు రోజూ 100 మి.లీ చొప్పున విజయ పాలు పంపిణీ చేసే పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లాలో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి, తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.

“అభివృద్ధిలో వెనుకున్న ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమం విజయాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు చురుకైన పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్వాడీ టీచర్లు అంకితభావంతో కృషి చేయాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులను కలిసి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని కోరారు.

నిర్లక్ష్యం చేస్తే ఆస్తుల జప్తు

మంత్రి సీతక్క ఇదే వేదికపై వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు గట్టి హెచ్చరిక చేశారు. ‘‘తల్లిదండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తు చేసి తల్లిదండ్రుల పేరు మీదకు మార్చడం జరుగుతుందని తెలిపారు

బాల్య వివాహాలు వద్దు

అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలపై ఏర్పాటు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. బాల్య వివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతమని, ములుగును బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..