Minister Seetakka: ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న సీతక్క.. అధికారులకు వార్నింగ్..
ఆదిలాబాద్ అభివృద్ధికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించేలా చూస్తామన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్నారు. అటవీహక్కులు, కేంద్ర చట్టాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తే.. ప్రభుత్వ పరంగా తామేం చేయాలో అది చేస్తామంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క.

కొమురం భీం జిల్లా, జనవరి 24: ఆదిలాబాద్ అభివృద్ధికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించేలా చూస్తామన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్నారు. అటవీహక్కులు, కేంద్ర చట్టాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తే.. ప్రభుత్వ పరంగా తామేం చేయాలో అది చేస్తామంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. కొమురం భీం జిల్లా కోట పరండోలి గ్రామంలో జరుగుతున్న ఆదివాసీ ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సహజ సిద్దంగా ఏర్పడిన జంగుబాయి క్షేత్రాన్ని.. ప్రకృతికి ఎలాంటి హానీ కలిగించకుండా అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం జంగుబాయి ఆలయంపై సీతకన్ను వేసిందని.. కనీసం ఆలయం వరకు రోడ్డు మార్గం కూడా నిర్మించలేదని విమర్శించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో ఆదివాసీ ప్రధాన జాతరలకు పెద్ద పీఠ వేస్తామని.. జంగుబాయి, నాగోబా ఆలయాల అభివృద్దికి నిధులిస్తామన్నారు సీతక్క. ఆ తర్వాత.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్దిపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాలపై సవతి ప్రేమ చూపిందన్నారు. అటవీహక్కుల పేరిట ఆదివాసీల భూములను లాక్కుందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి తెలంగాణలోని అటవి పరిధిలోని గ్రామాల అభివృద్దికి సహకరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో.. ఏ అధికారి.. నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదన్నారు సీతక్క. అటవీహక్కులు, కేంద్ర చట్టాలంటూ ఓవర్ యాక్షన్ చేస్తే.. ప్రభుత్వ పరంగా తామేం చేయాలో అది చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




