కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా..అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ నెల 26 నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది..అందులో భాగంగా మోడల్ హౌజ్ లు నిర్మాణం చేపట్టింది..రాష్ట్రంలోనే మొదటి ఇందిరమ్మ మోడల్ హౌజ్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..
ఖమ్మం జిల్లా కూసుమంచి లో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలో నే కూసుమంచిలో మొట్ట మొదటిగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు.
డిసెంబర్ 13 న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇంటికిభూమి పూజ చేశారు.72 గజాల్లో 400 SFT లో ఇందిరమ్మ నమూనా ఇంటిని నిర్మించారు. ఈఇంటిని బెడ్ రూం, హాల్, కిచెన్ అటాచ్డ్ బాత్ రూం తో నిర్మించారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది..అర్హులను సర్వే ద్వారా గుర్తించి ఇవ్వనుంది..మొదటి ఏడాది 4.50 లక్షల ఇళ్లు..నాల్గు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.. శర వేగంగా లబ్ధిదారుల ఎంపిక జరిగి..అర్హులకు అందజేయనుంది.. హౌజింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజక వర్గంలో ముందుగా మోడల్ హౌజ్ పూర్తి చేసుకుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..