Bhumatha Portal: దేశానికి రోల్‌ మోడల్‌గా ‘భూమాత’.. అతి త్వరలో అందుబాటులోకి పోర్టల్ః మంత్రి పొంగులేటి

|

Oct 05, 2024 | 5:52 PM

తెలంగాణలో ధరణి ప్లేస్‌లో భూమాత పోర్టల్‌ రానుంది. అతి త్వరలోనే భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికే రోల్‌ మోడల్‌గా భూమాత ఉండబోతోందన్నారు పొంగులేటి.

Bhumatha Portal: దేశానికి రోల్‌ మోడల్‌గా భూమాత.. అతి త్వరలో అందుబాటులోకి పోర్టల్ః మంత్రి పొంగులేటి
Bhumata Portal
Follow us on

తెలంగాణలో ధరణి ప్లేస్‌లో భూమాత పోర్టల్‌ రానుంది. అతి త్వరలోనే భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశానికే రోల్‌ మోడల్‌గా భూమాత ఉండబోతోందన్నారు పొంగులేటి. ధరణి సమస్యలకు చెక్‌ పెట్టేలా.. అందరికి భద్రత కల్పిస్తూ భూమాత రానున్నట్లు వెల్లడించారు.

ధరణి మాడ్యుల్స్, టెక్నికల్​ ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్​ తీసుకురానుంది రేవంత్‌ సర్కార్. ఇప్పటివరకూ ఒక్కసారి అప్లికేషన్ ​తిరస్కరణకు గురైతే, అప్పిలేట్ అవకాశం లేకుండా సివిల్ ​కోర్టుకు వెళ్లాల్సి ఉండేది. అయితే, కొత్త చట్టంలో ఈ విధానానికి చెక్​ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థను కూడా ఆన్‌లైన్‌​లో చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో సమస్యలు ఉన్నాయని గుర్తించిన రేవంత్‌ ప్రభుత్వం.. వాటి పరిష్కారంపై దృష్టి సారించింది. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై ప్రత్యేక కమిటీ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించారు. దీంతో కమిటీ నివేదిక ఆధారంగా సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని కొత్తగా భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది రేవంత్ సర్కార్.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ ప్రక్షాళనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ కూడా స్పెషల్ డ్రైవ్‌లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించింది. ధరణి డ్రైవ్‌లో పరిష్కరించిన దరఖాస్తులపైనా చర్చించింది. ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూసమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..